రోజూ ప‌ర‌గ‌డుపునే నెయ్యి తాగితే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

పాల నుండి త‌యారు చేసే ప‌దార్థాల్లో నెయ్యి కూడా ఒకటి. తీపి ప‌దార్థాల త‌యారీలో నెయ్యిని మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. నెయ్యిని వేసి త‌యారు చేసిన ఆహార ప‌దార్థాల రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌నిలేదు. నెయ్యిని తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌నే కార‌ణం వ‌ల్ల‌ చాలా మంది దీనిని తిన‌రు. కానీ ఇది అంతా అపోహ మాత్ర‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిని.. ముఖ్యంగా ఆవు నెయ్యిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని ఆయుర్వేద నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

నెయ్యిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ప్ర‌తిరోజూ ప‌ర‌గ‌డుపున 5 నుండి 10 ఎంఎల్ మోతాదులో నెయ్యిని తీసుకోవ‌డం వల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగును చిల‌క‌గా వ‌చ్చిన వెన్న‌తో నెయ్యిని త‌యారు చేస్తారు. నెయ్యి ఎంతో బ‌ల‌వ‌ర్ద‌క‌మైన ఆహారం. 2 టీ స్పూన్ల నెయ్యిలో దాదాపు 300 క్యాలరీల శ‌క్తి ఉంటుంది. త‌గిన మోతాదులో ఆవు నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు నాడీ వ్య‌వ‌స్థ మెరుగుప‌డి మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది.

take ghee daily for these amazing benefits

రాత్రి ప‌డుకునే ముందు పాల‌లో కొద్ది మోతాదులో నెయ్యిని క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగుప‌డి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య తగ్గుతుంది. త‌ర‌చూ ఆవు నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. క్యాన్స‌ర్ కణాల‌ను నిరోధించే శ‌క్తి కూడా నెయ్యికి ఉంద‌ని ఇటీవ‌లి ప‌రిశోధ‌న‌లు తెలియ‌జేస్తున్నాయి. త‌ర‌చూ నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఆహారంలో త‌గిన మోతాదులో నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియల రేటు పెరిగి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. ఎదిగే పిల్ల‌లకు ప్ర‌తిరోజూ నెయ్యిని ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారి ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉండ‌డంతోపాటు జ్ఞాప‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. చ‌ర్మాన్ని కాంతివంతంగా, అందంగా క‌న‌బ‌డేలా చేసే గుణం కూడా నెయ్యికి ఉంది. ఛాతి ప‌రిమాణం త‌క్కువగా ఉన్న వారు ఆవు నెయ్యిని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌ని ఫ‌లితం ఉంటుంది.

రోజూ నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెర‌గ‌డంతోపాటు వీర్య‌క‌ణాల సంఖ్య కూడా పెరుగుతుంది. నెయ్యిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. క‌నుక దీనిని త‌గిన మోతాదులో తీసుకుని ఆరోగ్యక‌ర‌మైన‌ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts