హెల్త్ టిప్స్

రోజూ ఈ ఆహారాల‌ను తినండి.. వందేళ్లు ఎలాంటి రోగాలు రాకుండా జీవించ‌వ‌చ్చు..

ఆఫీసుల్లో పనిచేస్తూనే ఏదో ఒకటి అంటూ నిరంతరం నోటికి పని చెపుతున్నారా? సరి చేసుకోండి. ఎంతమాత్రం ఆరోగ్యం కాదు. ఇంటి వద్ద వంట చేయటం కుదరక, రకరకాల ప్యాకేజీ ఆహారాలు, మీ హేండ్ బేగుల్లోను, ఆఫీస్ డ్రాయర్ లోను పెట్టేసి, ఒక వైపు పని చేస్తూ మరోవైపు పేక్ చేసిన ఆహారాలపై చేయి, నోరు ఆడించేస్తూవుంటే…అంతకన్నా అనారోగ్య చర్య మరోటి లేదంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ ఆహారాలలో వుండే అమితమైన కొవ్వు, ఉప్పు, షుగర్ అన్నీ కలసి మీకు అధిక బరువు, డయాబెటీస్, గుండెజబ్బులు వంటివి తెచ్చిపెడతాయి. సాధారణంగా ప్రతి ఒక్కరు వారికి తెలియకుండానే కొన్ని చెడు ఆహారపు అలవాట్లకు లొంగిపోతారు. అవేమిటో పరిశీలిద్దాం!

చిప్స్, బిస్కట్లు, చాక్లెట్లు మొదలైనవి పనిలోపడి ఒక్కటొక్కటిగా తినేస్తూ వుంటారు. దీనివలన మీకు ఎనర్జీ వచ్చేది సరైనదే. కాని చివరకు ఈ తిండ్లు మీలో అనవసరమైన కొవ్వు డిపాజిట్ చేస్తాయి. స్నాక్స్ లో వుండే ఉప్పు మీలో రక్తపోటు కలిగిస్తుంది. నీరు నిలబడి వుండేలా చేస్తుంది. అందుకుగాను అన్ని రకాలు డ్రాయర్ లో పెట్టుకోకండి. తినే ఒక్క ఆహారం కూడా తక్కువ తినండి. ప్రతి రెండు గంటలకు కాఫీ లేదా టీ తాగేయటం అలవాటయ్యిందా? ఇవి అధికమైతే, చికాకు, కోపం, శరీరంలో నీరు కొరవడటం వంటివి ఏర్పడి మీ నిద్రను సైతం నష్టపరుస్తాయి. ఇక భోజనం ముందు వీటిని తీసుకుంటే….భోజనంలో పోషకాలు కూడా వృధా అయిపోతాయి. వీటికి బదులు, గ్రీన్ టీ, నిమ్మరసం, పండ్లరసం వంటివి తాగటానికి ప్రయత్నించండి. లేదా తాగే కాఫీ, టీలు చిన్న కప్పుకు మాత్రమే లిమిట్ చేయండి.

take healthy foods daily to live long life

నేటిరోజుల్లో ఆఫీసులు ఎయిర్ కండిషన్డు గదులు కావటంతో చెమట పట్టదు. దాహం వేయదు. తాగే అవసరం వుండదు. తాగినా శరీరం అధికంగా భావిస్తుంది. ఇదే కొనసాగితే, మీలో మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, అధిక ఆకలి, డీహైడ్రేషన్ అన్నీ ఏర్పడి మీ చర్మం సైతం వన్నె తగ్గుతుంది. దీనికిగాను ఒక బాటిల్ నీరు మీ టేబుల్ వద్ద పెట్టుకొని సాయంత్రానికల్లా దానిని పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోండి. ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళి రాత్రి భోజనం ఇక ఎంతో ఆత్రంగా అధికంగా తినేస్తారు. లేటుగా తింటే అది శరీరానికి హాని చేస్తుంది. ఆ సమయంలో శరీరానికి అవసరమైంది విశ్రాంతి, నిద్ర కాని ఆహారాలు కాదు. మీరు తినే అధిక కార్బోహైడ్రేట్ల అన్నం వంటి పదార్ధాలు, మీరు నిద్రించే సమయానికి ముందే శరీరం జీర్ణం చేసుకోలేదు. తిని పడుకుంటే, ఇక అవి మీ శరీరంలో కొవ్వుగా డిపాజిట్ అయిపోతాయి. పగలంతా మీ శరీరానికి అవసరమైన ఆహారం ఇచ్చారు. మరల రాత్రి అదనంగా ఇచ్చిన ఆహారం శరీరానికి అవసరం లేక కొవ్వు ఏర్పరచి లావు అయేలా చేస్తుంది. అందుకని, రాత్రి భోజనం లైట్ గా కొన్ని కూరలు, ప్రొటీన్లు మాత్రమే వుండేలా చూసుకోండి. పీచు అధికంగా వుండే కూరలు, ప్రొటీన్లు మీ కడుపు నింపి అవసరమైన కేలరీలు మాత్రమే అందించేలా చూడండి.

Admin

Recent Posts