హెల్త్ టిప్స్

భోజ‌నం చేశాక తీపి తినాల‌ని ఉంటే.. బెల్లం తినండి.. ఎందుకంటే..?

చక్కెర కంటే బెల్లం చాలా మంచిది అని అందరికీ తెలుసు. కానీ మనం ఎక్కువగా చ‌క్కెరనే వాడుతాము. బెల్లం తియ్యగా ఉండడమే కాకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే బెల్లంలో ఖనిజాల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజూ బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు రక్తహీనత సమస్య ఉంటే బెల్లంతో దానికి చాలా తేలికగా చెక్ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

అయితే రోజూ బెల్లం తినడం వల్ల గ్యాస్ సమస్యలు, కడుపు ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతాయి. మనకి భోజనం చేసిన వెంటనే ఏదైనా తీపి తినాలి అని అనిపించడం సహజం. అటువంటి సమయంలో ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. బెల్లాన్ని తినడం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధిచేస్తుంది.

take jaggery if you would like to eat sweet after meals

ఇక బాగా నీరసంగా లేదా బలహీనత లక్షణాలు కనిపించినట్లు అయితే శక్తి కోసం వెంటనే బెల్లాన్ని తీసుకోవచ్చు. ఇలా చెయ్యడం వలన మీ ఎనర్జీ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. ఇలా చెయ్యడం వలన షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసినప్పుడు మీకు అలసటగా అనిపిస్తే వెంటనే ఒక ముక్క బెల్లాన్ని తినండి. పాలల్లో రోజూ బెల్లం వేసుకుని తాగడం వలన గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. బెల్లం చర్మానికి నిగారింపును ఇస్తుంది. మొటిమలను సైతం తగ్గిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలు ఉన్నప్పుడు బెల్లం వాడితే మంచి ఫలితం ఉంటుంది.

బెల్లం అతిగా తినడం వలన బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. డైట్ లో ఉన్నవారు కొంచెం బెల్లం తీసుకోవడం వల్ల సమస్య ఏమీ ఉండదు కానీ మొతాదుకు మించి తీసుకుంటే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లతో పాటు కొవ్వులు, ప్రోటీన్లు కూడా ఉంటాయి.

Admin

Recent Posts