lifestyle

మా ఆయన 5 సంవత్సరాల నుండి సంసారానికి దూరంగా ఉంటునాడు ఏం చేయాలి?

ముందుగా మీ వైపు నుంచి స్వీయ పరిశీలన చేసుకొని తప్పులు దిద్దుకోండి. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు, కుటుంబ భాద్యతలు, పిల్లల పెంపకంలో పడి తమ శరీరం గురించి పట్టించుకోవడం మానేస్తారు. విపరీతంగా లావు కావడంతో, భర్త దగ్గర నెగటివ్ మార్క్స్ పడటం జరుగుతుంది. స్త్రీలకు ( పురుషులకు కూడా ) ఏ వయసులోనైనా శారీరక ఆకర్షణ చాలా ముఖ్యం అని ఈ మధ్య గరికపాటి చెప్పారు. అది వాస్తవం కూడా. కాబట్టి మీరు మీ వైపు ఏమైనా తప్పిదాలు ఉన్నాయా అని అలోచించి సరిదిద్దుకోండి. భర్త, భార్యతో చనువుగా లేడంటే, కొంత భార్య తప్పు కూడా ఉంటుంది. మీరు ఏమైనా మీ వారిని మానసికంగా బాగా హ‌ర్ట్ అయ్యేలా ప్రవర్తించారా. కాబట్టి మీ వైపు సరిగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి.

కారణాలు రాస్తే అది పరిశోధన పత్రం అవుతుంది. 5 సంవత్సరాలనుండి అన్నారు. నా దృష్టిలో 5 సంవత్సరాలు అనేది చాలా చాలా ఎక్కువ. మీ మధ్య బాగా మానసిక దూరం పెరిగింది. మీరు మీ వారితో సరైన కమ్యూనికేషన్ లో లేనట్లే. మీరే సిగ్గుపడకుండా అడగండి, ఎందుకు నన్ను దూరం పెడుతున్నారని. మీ వయసు, మీ వారి వయసు తెలియదు. మీ వారు ఖచ్చితంగా ఏదయినా శారీరక లేదా మానసిక సమస్య లేదా రెండింటితో బాధపడుతున్నాడు.సాధారణంగా 50 years దాటిన పురుషులలో testosteron hormone తగ్గడం వల్ల వారికి శృంగారం పై పూర్తి ఆసక్తి తగ్గిపోతుంది అని పరిశోధనల సారాంశం. Stress, పోషకాహర లోపం……ఇంకా చాలా కారణాలు ఉన్నాయి.

wife said about her husband behavior from 5 years

మీ వారితో మంచి చనువు పెంచుకొని సమస్య ఏమిటో కనుక్కోండి. అవసరం అయితే మంచి sexologist / psychiatrist / Clinical psychologist కు చూపించుకోమని ప్రోత్సహించండి. ధీమా, భరోసా కల్గించండి. మీ సమస్య మీరే పరిష్కరించుకోవాలి లేదా పరిష్కరించే వారి దగ్గరికి వెళ్ళాలి. అది మీ చేతి లోనే ఉంది. వైద్య రంగంలో ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలకు, ఇదేమి పెద్ద పరిష్కరించ లేని సమస్య కాదు. Viagra అలా కనిపెట్టిందే. ( సైడ్ఎఫెక్ట్ ఉండవచ్చు. అది వేరే విషయం ) మీకు శుభం కలగాలని కోరుకుంటున్నా..

Admin

Recent Posts