Super Fast Brain : మన శరీరంలో మెదడు అత్యంత ముఖ్యమైన అవయవం. మన జ్ఞాపకాలను ఇది స్టోర్ చేసుకుంటుంది. అలాగే మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. మనకు కలిగే అనేక భావాలను నియంత్రిస్తుంది. మెదడు మన శరీరం నుంచి గ్లూకోజ్‌ను ఎక్కువగా వాడుకుంటుంది. అయితే కొందరి మెదడు చురుగ్గా పనిచేయదు. దీంతో వారు బద్దకంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేయలేకపోతుంటారు. దీంతోపాటు మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గుదట, ఏకాగ్రత లోపించడం.. వంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే కింద తెలిపిన ఆహారాల్లో వేటిని అయినా సరే రోజూ తీసుకోవడం వల్ల మెదడును సూపర్ ఫాస్ట్‌గా పనిచేయించవచ్చు. మెదడు చురుగ్గా మారి యాక్టివ్‌గా ఉంటారు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. వారంలో కనీసం 2 సార్లు చేపలను తినాలి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడులోని కణాలను రక్షిస్తాయి. దీని వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. పిల్లలు అయితే చదువుల్లో రాణిస్తారు. కనుక చేపలను కచ్చితంగా తినాలి.
2. రోజుకు కనీసం 2 కప్పుల కాఫీ తాగితే మెదడు సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల మెదడు ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉంటుంది. కాఫీలో కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి.
3. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ మెదడులోని కణాలను సంరక్షిస్తుంది. కణాలు వాపులకు గురి కాకుండా చూస్తుంది. దీంతో మెదడు పనితీరు మెరుగు పడుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడేలా చేస్తుంది. రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే మెదడు యాక్టివ్‌గా మారుతుంది. వేగంగా పనిచేస్తుంది.
4. మెదడును యాక్టివ్‌గా ఉంచడంలో గుమ్మడికాయ విత్తనాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని రోజూ సాయంత్రం గుప్పెడు మోతాదులో తినాలి. లేదా ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో పాటు తీసుకోవచ్చు. ఈ విత్తనాల్లో జింక్, మెగ్నిషియం, కాపర్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. దీంతో మెదడు వేగంగా పనిచేయగలుగుతుంది. అప్రమత్తంగా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
5. బాదంపప్పు, వాల్ నట్స్‌ను రోజూ గుప్పెడు మోతాదులో తినాలి. వీటిలో ఉండే విటమిన్ ఇ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. మెదడులోని కణాలను సంరక్షిస్తుంది. వీటిని రోజూ తింటే మెదడుకు ఎంతో మేలు జరుగుతుంది.
6. నారింజ పండ్లను కూడా తరచూ తినడం వల్ల మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వీటిలోని విటమిన్ సి మెదడులోని కణాలను సంరక్షిస్తుంది. మెదడును యాక్టివ్‌గా మారుస్తుంది.
7. కోడిగుడ్లలో విటమిన్ బి6, బి12, కోలిన్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు వేగంగా పనిచేసేలా చేస్తాయి. రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే మెదడుకు ఎంతో మేలు జరుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది.
8. మెదడు వేగంగా పనిచేయాలంటే రోజుకు 2 కప్పుల గ్రీన్ టీని కూడా తాగవచ్చు. దీంట్లో ఉండే కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడును చురుగ్గా ఉండేలా చేస్తాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కనుక గ్రీన్ టీని కూడా రోజూ తాగవచ్చు.