దూసర తీగ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ తీగ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. పొదలపై తీగలు అల్లుకుంటాయి. చేలు, పొలాల గట్టుల మీద పెరుగుతాయి. దూసర తీగలను ఇంట్లోనూ పెంచుకోవచ్చు. పెద్దలు ఈ తీగ ఆకుల రసాన్ని పశువుల గాయాలకు రాస్తారు. దీంతో అవి త్వరగా మానుతాయి. ఇక దూసర తీగ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సాధారణంగా చాలా మందికి కళ్ల మంట, కళ్ల దురద, కంటి రెప్పలపై కురుపులు ఏర్పడుతుంటాయి. దీంతో చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాంటి వారు దూసర తీగను బాగా దంచి రసం తీసి ఆ రసాన్ని కను రెప్పలపై రాయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం పాటు చేస్తే అన్ని రకాల కంటి సమస్యలు తగ్గుతాయి.
2. చర్మ సమస్యలను తగ్గించడంలో దూసర ఆకులు బాగా పనిచేస్తాయి. చర్మంపై దద్దుర్లు, దురద, ఎరుపుగా మారడంతోపాటు గజ్జి వంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని రాయాలి. రోజూ ఇలా చేస్తుంటే ఆయా సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయి.
3. చాలా మందికి శరీరంలో అధిక వేడి ఉంటుంది. అలాంటి వారు దూసర తీగ ఆకులను దంచి పసరు తీయాలి. దాన్ని గ్లాసులో వేసి 5 గంటల పాటు అలాగే ఉంచాలి. దీంతో జెల్ తయారవుతుంది. అందులో కొద్దిగా పటికబెల్లం కలిపి తినాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తుంటే శరీరంలోని వేడి బాగా తగ్గుతుంది. శరీరం చల్లగా ఉంటుంది.
4. షుగర్ ఉన్నవారికి దూసర ఆకులు బాగా పనిచేస్తాయి. గుప్పెడు ఆకులను తీసుకుని ఒక పాత్రలో వేసి అందులో కొద్దిగా నీరు పోసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
5. దూసర తీగ ఆకుల రసాన్ని తీసి రోజూ తాగుతుంటే స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. సంతాన లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365