NTR : స్టార్ హీరోల ఫ్యాన్స్ అంటే అంతే.. తమ హీరో మీద వారు మాట పడనివ్వరు. ఆయనకు ఏమీ కాకుండా చూసుకుంటాం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. అయితే అభిమానం సాధారణంగా ఉన్నంత వరకు ఓకే. కానీ అదే అభిమానం హద్దులు దాటితే మాత్రం ప్రాణాల మీదకు వస్తుంది. తాజాగా జరుగుతున్నది అదే. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌లు కలసి నటించడంతో.. ఫ్యాన్స్‌కు మాత్రం ఈ విషయం మింగుడు పడడం లేదు. దీంతో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు. అది ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లింది.
నల్గొండ జిల్లాలోని కోదాడ వద్ద ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. ఓ థియేటర్‌లో ఎన్‌టీఆర్ అభిమానులు ఆయన కటౌట్‌ను కట్టేందుకు యత్నించారు. అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ అందుకు అభ్యంతరం తెలిపారు. దీంతో మనస్థాపం చెందిన ఓ ఎన్‌టీఆర్ ఫ్యాన్ అక్కడికక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో చుట్టూ ఉన్నవారు వెంటనే అలర్ట్ అయి అతన్ని ఆ ప్రమాదం నుంచి రక్షించారు. తరువాత ఆ సంఘటన ఇద్దరు హీరోలకు చెందిన ఫ్యాన్స్ మధ్య తీవ్రమైన గొడవకు దారి తీసింది. ఇరు హీరోలకు చెందిన ఫ్యాన్స్ చేతులతో ముష్టి యుద్ధానికి దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఫ్యాన్స్‌ను చెల్లా చెదురు చేశారు.
అయితే వాస్తవానికి ఎన్‌టీఆర్, చరణ్‌లు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్. వీళ్లు కలసి మెలసి ఉంటారు. ఎక్కడకు వెళ్లినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఎప్పుడూ తమ హీరో మీద మాట పడకుండా.. పక్క హీరో మీద నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు. అందుకనే ఈ గొడవలు జరుగుతుంటాయి. ఫ్యాన్స్ ఇలా అనవసరంగా తన్నుకోవడమే కానీ.. అందులో వచ్చేది ఏమీ ఉండదు. హీరోలు మాత్రమే కలిసే ఉంటారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే మంచిది.