హెల్త్ టిప్స్

మీ దంతాలు స‌హ‌జ‌సిద్ధంగా తెల్ల‌గా మారాలంటే ఇలా చేయండి..!

దంతాలు వివిధ కారణాలుగా రంగు మారతాయి. అవి పచ్చగా వున్నా లేక నల్లగా వున్నా అసహ్యమనిపిస్తూంటుంది. తెల్లటి దంతాలు పొందాలంటే ఎన్నో సహజమార్గాలున్నాయి. అయితే త్వరగా ఫలితం కనపడాలంటే దిగువ చిట్కా పాటించండి.

పండ్లు – స్ట్రాబెర్రీలు, నిమ్మ, ఆరెంజ్ వంటివి దంతాలను తెల్లపరచటమే కాక నోరు వాసన లేకుండా చేస్తాయి. రోజూ రెండు సార్లు 3 నుండి 5 నిమిషాలపాటు నిమ్మరసం కలిపిన ఆవనూనె, ఉప్పు లతో దంతాలు రుద్దితే వారం రోజుల్లో అవి తెల్లబ‌డ‌టం ఖాయం. భోజనం చేసిన ప్రతిసారి ఒక వారంరోజులపాటు ఆరెంజస్ తినండి.

take these foods to get your teeth whiten naturally

నిమ్మకాయ ముక్కను నాకండి. రోజూ స్ట్రాబెర్రీ గుజ్జును రెండు సార్లు తినండి. పళ్ళు తెల్లపడటమే కాక, నోటి దుర్వాసన కూడా పోతుంది. నోటిని కడగండి – ఆహారం తీసుకున్న తర్వాత, అది కొంచెం అయినా సరే, ప్రతిసారి నీటిని పుక్కిలించి కడగండి. వాము తింటే చిగుళ్ళు గట్టిపడతాయి. పళ్ళకు అంటుకునే ఆహారం లేదా కాఫీ ఉత్పత్తులు వాడకండి.

Admin

Recent Posts