Sleep : ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు అధికమవుతున్నాయి. వీటి బారిన పడి చాలా మంది అవస్థలు పడుతున్నారు. దీంతోపాటు నిద్రలేమి సమస్య కూడా చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే పడుకున్న వెంటనే గాఢమైన నిద్రలోకి జారుకోవాలంటే.. రాత్రి పూట నిద్రకు ముందు ఈ పానీయాలను తాగాల్సి ఉంటుంది. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. రాత్రి పూట ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కాస్త తేనె కలిపి తాగడం వల్ల పడుకున్న వెంటనే గాఢమైన నిద్ర పట్టేస్తుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ గాఢమైన నిద్ర పట్టేలా చేస్తుంది. మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
2. రాత్రి భోజనం చేసిన అనంతరం ఒక కప్పు ద్రాక్ష రసం తాగాలి. లేదా ఒక కప్పు ద్రాక్షలను తినాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. దీంతో నిద్ర బాగా పడుతుంది.
3. ఒక కప్పు నీటిలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఆ నీటిని 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత ఆ నీటిలో కాస్త తేనె కలిపి తాగాలి. దీని వల్ల కూడా గాఢంగా నిద్ర పడుతుంది. దీన్ని కూడా రాత్రి నిద్రకు ముందు తాగాల్సి ఉంటుంది.
4. ఒక టీస్పూన్ మెంతులను నీటిలో ఉదయం నానబెట్టాలి. రాత్రి నిద్రకు ముందు ఆ నీటిని ఒక కప్పు మోతాదులో తాగాలి. దీనివల్ల షుగర్ లెవల్స్ తగ్గడమే కాదు.. నిద్ర బాగా పడుతుంది.