హెల్త్ టిప్స్

Foods For Eye Sight : ఇవి గుప్పెడు 10 రోజులు క్రమ తప్పకుండా తీసుకోండి.. కళ్లజోడుకు బైబై చెబుతారు..

Foods For Eye Sight : పూర్వం మ‌న పెద్ద‌లు 80 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చినా కానీ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు కార‌ణం అప్ప‌ట్లో వారు చేసిన శ్ర‌మ‌, తీసుకున్న ఆహారమే అని చెప్ప‌వ‌చ్చు. అయితే అప్ప‌ట్లో వారికి వృద్ధాప్యం వ‌చ్చినా కూడా కంటి చూపు స్ప‌ష్టంగా క‌నిపించేది. కానీ ఇప్పుడు చిన్న పిల్ల‌లే క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీనికి పోష‌కాల లోపం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌కు అల‌వాటు ప‌డ్డారు. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని అస‌లు తీసుకోవ‌డం లేదు.

దీంతో పోష‌కాలు ల‌భించ‌క అనేక వ్యాధులు వ‌స్తున్నాయి. వాటిల్లో కంటి చూపు స‌మ‌స్య కూడా ఒక‌టి. పోష‌కాలు లేని ఆహారం తిన‌డం వ‌ల్ల క‌ళ్ల‌కు ర‌క్ష‌ణ ల‌భించ‌డం లేదు. దీని వ‌ల్ల చిన్న వ‌య‌స్సులోనే అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారు. అయితే కింద చెప్పిన ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. దాంతో కంటి చూపును కేవ‌లం నెల రోజుల్లోనే పెంచుకోవ‌చ్చు. దీంతో క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు. ఇక కంటి చూపును పెంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

take these to improve eye sighttake these to improve eye sight

వారంలో క‌నీసం 2 సార్లు చేప‌ల‌ను ఆహారంగా తీసుకోవాలి. లేదా స‌ముద్రపు ఆహారం ఏదైనా ఫ‌ర్లేదు. దీంతో మ‌న‌కు ముఖ్యమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ల‌భిస్తాయి. ఇవి కంటి చూపుకు ఎంతగానో మేలు చేస్తాయి. క‌ళ్ల‌ను ర‌క్షిస్తాయి. అలాగే వాల్ న‌ట్స్‌, జీడిప‌ప్పు, బాదం, పిస్తా వంటి న‌ట్స్‌ను రోజూ నాన‌బెట్టి గుప్పెడు మోతాదులో తినాలి. వీటిల్లో విట‌మిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. దీంతో కంటి చూపు దెబ్బ తినకుండా ఉంటుంది. క‌ళ్లకు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

చియా సీడ్స్‌, అవిసె గింజ‌లు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి విట‌మిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను క‌లిగి ఉంటాయి. క‌నుక కంటి చూపు పెరిగేందుకు దోహ‌దం చేస్తాయి. ఇక విట‌మిన్ ఎ అధికంగా ఉండే ట‌మాటా, యాపిల్‌, క్యారెట్‌, విట‌మిన్ సి అధికంగా ఉండే పైనాపిల్‌, ద్రాక్ష‌, నిమ్మ‌, నారింజ‌, కివీ, బొప్పాయి వంటి పండ్ల‌ను కూడా రోజూ తినాలి. దీంతో క‌ళ్లు సుర‌క్షితంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది.

ఆకుప‌చ్చ‌ని ఆకుకూర‌లైన పాల‌కూర‌, గోంగూర‌, చుక్క కూర‌, తోట‌కూర‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఎ అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. కంటి స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. అలాగే చిల‌గ‌డ‌దుంప‌లు, కోడిగుడ్ల‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా కంటి చూపు మెరుగు ప‌డుతుంది. దీంతోపాటు రోజూ త‌గిన‌న్ని నీళ్ల‌ను కూడా తాగాలి. దీంతో కంట్లో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. కంటి చూపు మెరుగు ప‌డుతుంది. క‌ళ్ల దుర‌ద‌లు రావు. ఇలా ప‌లు ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు అమాంతం పెరుగుతుంది. దెబ్బ‌కు క‌ళ్ల‌ద్దాల‌ను తీసి ప‌డేస్తారు. ఈ ఆహారాలు ఇంకా ఇత‌ర అనేక ప్ర‌యోజ‌నాల‌ను సైతం అందిస్తాయి. క‌నుక వీటిని త‌ర‌చూ తీసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Admin

Recent Posts