హెల్త్ టిప్స్

స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ లైంగిక కోరిక‌ను క‌లిగించే ఆహారం ఇది.. రోజూ తీసుకోవాలి..!

సాధారణంగా మనం బాదంని నానబెట్టుకుని తింటాము. దాని వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనకి తెలుసు. అయితే బాదం పాలు తాగడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని ఇప్పుడు చూద్దాం. బాదం పాల‌ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పప్పు నానబెట్టి తొక్క తీసి మెత్తగా రుబ్బి నీళ్లు పోసి పాలలా చిక్కగా కనబడే వరకు కలపాలి. ఇలా చేసిన దానిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎముకలు గట్టిపడడానికి బాదం పాలు మేలు చేస్తాయి. ఆవు పాల కంటే బాదం పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ సమస్యలు కూడా రావు. బాదం పాలు తీసుకోవడం వల్ల రక్తం లో హిమోగ్లోబిన్ స్థాయిల‌ని పెంచుకోవచ్చు. అలాగే ఇది రక్తహీనతను కూడా పోగొడుతుంది.

బాదం తీసుకోవడం వల్ల సెక్స్ హార్మోన్లను విడుదల చేసేలా ఉపయోగపడుతుంది. అలానే ఇది మహిళల్లో కోరికలు పెంచడానికి కూడా ఉపయోగ పడుతుంది అని నిపుణులు అంటున్నారు. బాదం పాలు తాగడం వల్ల మెమరీ పవర్ ను కూడా పెంచుకోవచ్చు. మెదడుకి కావాల్సిన శక్తి బాదం పాలు ద్వారా చేరుతుంది. కాబట్టి పడుకునే ముందు ఒక గ్లాసు బాదం పాలు తాగండి. దీనితో మెమరీ పవర్ కూడా పెరుగుతుంది.

taking almond milk daily increases sexual desire in both men and women

దీనిలో సోడియం తక్కువగా ఉంటుంది. హెల్తీ ఫ్యాట్ కూడా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అలానే గుండె సమస్యల్ని తగ్గిస్తుంది.

Admin

Recent Posts