Diabetes : వీటిని తింటే షుగ‌ర్ ఎంత ఉన్నా స‌రే త‌గ్గుతుంది.. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేస్తాయి..

Diabetes : మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం మ‌న‌ల్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తున్నాయి. ముఖ్యంగా మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో దీని బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పెద్ద వారే కాకుండా యుక్త వ‌య‌సులో ఉన్న వారు డయాబెటిస్ బారిన ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన‌చ వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. అలాగే ఆహార నియ‌మాల‌ను కూడా పాటించాల్సి ఉంటుంది. ఏది ప‌డితే అది తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగి మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. డ‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తులకు మేలు చేసే కొన్ని తృణ ధాన్యాలు ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి.

డ‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తులకు మేలు చేసే తృణ ధాన్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డ‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తులు తీసుకోవాల్సిన ఆహారాల్లో బార్లీ ఒక‌టి. మూడు రోజుల పాటు మూడు పూట‌లా బార్లీతో చేసిన బ్రెడ్ ను,వంట‌కాల‌ను తీసుకోవాలి. బార్లీలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది జీర్ణాశ‌యంలో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచడంతో పాటు హార్మోన్ల విడుద‌ల‌పై కూడా చ‌క్క‌టి ప్ర‌భావాన్ని చూపిస్తుంది. దీని వ‌ల్ల‌ ర‌క్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. అలాగే శ‌రీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి రాక ఇబ్బందిప‌డుతున్న వారు బార్లీని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఓట్స్ ఎంత‌గానో మేలు చేస్తుంది. దీనిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది.

taking these foods can under control blood sugar levels for diabetes
Diabetes

ఓట్స్ ను మ‌నం ఆహారంలో చేర్చుకోవ‌డం కూడా చాలా తేలిక‌. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఉద‌యం పూట అల్పాహారంగా ఓట్స్ ను తీసుకోవ‌డం మంచిదని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అలాగే పోష‌కాలు క‌లిగిన మ‌రొక ధాన్యాల్లో ర‌మ్దాన్ కూడా ఒక‌టి. వీటిని రాజ్ గిరా, అమ‌ర్ నాథ్ అని కూడా పిలుస్తారు. ఈ ధాన్యాల్లో గ్లూటెన్ ఉండ‌దు. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు వీటిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఈ ధాన్యాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండ‌డంతో పాటు శ‌రీరానికి కావ‌ల‌సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అలాగే మ‌నం ఆహారంగా తీసుకునే తృణ ధాన్యాల్లో రాగులు ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

రాగుల‌ను ఏ రూపంలో తీసుకున్నా కూడా మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండ‌డంతో పాటు శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా త‌గ్గుతాయి. అదే విధంగా పాలిష్ ప‌ట్టిన బియ్యంతో వండిన అన్నాన్ని తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి. అదే బ్రౌన్ రైస్ ను తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు తెల్ల అన్నానికి బ‌దులుగా బ్రౌన్ రైస్ తో వండిన తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుద‌ని నిపుణులు చెబుతున్నారు. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు ఈ తృణ ధాన్యాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భించ‌డంతో పాటు డ‌యాబెటిస్ కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts