Teas For Weight Loss : నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక బరువు, పొట్టలో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అనేక రకాల డైటింగ్ పద్దతులను పాటిస్తూ ఉంటారు. వ్యాయామాలు చేయడం, డైటింగ్ పాటించడం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. కానీ ఇది అందరికి సాధ్యం కాదు. అలాంటి వారు మనకు సులభంగా లభించే పదార్థాలతో టీ లను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. మసాలా దినుసులను ఉపయోగించి చేసే ఈ టీ లను తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ టీ లను తయారు చేసుకోవడం చాలా సులభం.
వీటిని తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. బరువు తగ్గించే ఈ టీ లను ఎలా తయారు చేసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారు మన వంటింట్లో ఉండే పసుపును ఉపయోగించి టీ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపులో పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణం కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ టీ ని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ టీని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని పోసి బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఇందులో అర టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రెండు టీ స్పూన్ల తేనె వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత దీనిని గ్లాస్ లో పోసుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గించడంలో మనకు అల్లం టీ కూడా ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో జీవక్రియల రేటును పెంచి బరువు తగ్గేలా చేయడంలో అల్లం మనకు ఎంతో దోహదపడుతుంది. అల్లంతో టీ ని తయారు చేసుకుని రోపూ 2 నుండి 3 సార్లు తాగడం వల్ల మనం చాలా సులభంగా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. అలాగే అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు.
ఈ టీ ని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసి పది నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. అలాగే నిమ్మకాయ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల కూడా మనం అధిక బరువు నుండి బయటపడవచ్చు. దీని కోసం ఒక గ్లాస్ నీటిని వేడి చేసి అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి సులభంగా బరువు తగ్గవచ్చు. అదే విధంగా మనం వంటల్లో వాడే దాల్చిన చెక్కతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల జీవక్రియల రేటు పెరుగుతుంది.
దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ టీ ని తయారు చేసుకోవడానికి గానూ ఒక కప్పు నీటినిమరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మూత పెట్టి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఇందులో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అదే విధంగా బ్లాక్ టీ ని తాగడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు. ఈ టీని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ టీ ని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి అందులో కొద్దిగా టీ పొడి వేసి కలపాలి.
ఈ నీటిని 3 నిమిషాల పాటు మరిగించి, ఆ తరువాత వడకట్టి తేనె కలుపుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అదే విధంగా రోజుకు రెండు నుండి మూడు సార్లు గ్రీన్ టీ ని తాగడం వల్ల కూడా మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా మనకు సులభంగా లభించే పదార్థాలతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చని అలాగే ఈ టీ లను తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ టీ లలో ఏదో ఒక టీ ని మాత్రమే రోజూ తీసుకోవాలని వారు చెబుతున్నారు.