Thati Kallu Benefits : మనలో చాలా మంది తాటి కల్లును సేవిస్తూ ఉంటారు. ఈ కల్లును ప్రతిరోజూ తాగే వారు కూడా ఉన్నారు. కానీ తాటి కల్లు తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. చెట్టు నుండి అప్పుడే తీసిన స్వచ్ఛమైన తాటి కల్లులో మన శరీరానికి మేలు చేసే 18 రకాల సూక్ష్మ క్రిములు ఉన్నాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. తాటి కల్లులో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు.
తాటి కల్లులో 53 రకాల సూక్ష్మ క్రిములు ఉండగా వాటిలో 18 రకాల సూక్ష్మ క్రిములు మన శరీరంలో ఉన్న వ్యాధి కారక క్రిములను నశింపజేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. తాటికల్లులో ఉండే చఖరో మైసెస్ అనే సూక్ష్మ జీవికి మనిషి కడుపులో క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే ఒబిఎస్ 2 అనే క్యాన్సర్ కారక కణాలను నశింపజేసే గుణం ఉందని వారు చెబుతున్నారు. తాటికల్లును తాగడం వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో అస్థవ్యస్థమైన మానవుడి జీర్ణ వ్యవస్థను బాగు చేయడంలో తాటికల్లు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఉదయాన్నే పరగడుపున తాటి కల్లును లేదా ఈత కల్లును తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తాటి కల్లును తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. అయితే పులిసిన లేదా పుల్లగా మారిన తాటికల్లును తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చెట్టు నుండి తీసిన తాటికల్లును ఒక గంట నుండి లోపే తాగాలని అలా తాగక పోతే అందులో బ్యాక్టీరియా వృద్ధి చెంది అనారోగ్యానికి కారణమవుతుంది వారు తెలియజేస్తున్నారు. స్వచ్ఛమైన, తాజా తాటికల్లును తాగినప్పుడే మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.