హెల్త్ టిప్స్

నీళ్ల‌ను ఎలా ప‌డితే అలా తాగ‌కండి.. వాటిని తాగేందుకు కూడా ఈ ప‌ద్ధ‌తుల‌ను పాటించాలి..!

ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్ళు తాగడం మంచిదని చెబుతుంటారు. కావాల్సినన్ని నీళ్ళు శరీరంలోకి వెళ్ల‌కపోతే అనేక అనర్థాలు జరుగుతుంటాయి. ఐతే ఎన్ని నీళ్ళు తాగుతారో చెబుతారు, కానీ నీళ్ళు త్రాగడానికి కూడా ఓ పద్దతుందని, అలా తాగితే అనేక అనర్థాల నుండి బయటపడతామని ఎవరూ చెప్పరు. నీటిని తాగే పద్దతుల గురించి తెలుసుకుని సమస్యల నుండి బయటపడదాం. నీళ్ళు తాగడానికి ప్రత్యేక సమయం అంటూ ఏదీ లేదు. సాధారణంగా పొద్దున్నే ఖాళీ కడుపుతో నీళ్ళు తాగడం మంచిదని చెబుతుంటారు. 7 నుండి 8గంటల పాటు కడుపులో ఏమీ ఉండదు కాబట్టి నీళ్ళు తాగడం మంచిదే. కానీ దాహం వేస్తేనే నీళ్ళు తాగాలి.

నిలబడి నీళ్ళు తాగడం మంచిది కాదు. కూర్చుని తాగడం నేర్చుకోండి. నిలబడి నీళ్ళు తాగడం వల్ల కిడ్నీల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటికి ఎక్కువ శ్రమ ఇచ్చిన వారమవుతాం. నిలబడి తాగడం వల్ల నీళ్ళు చాలా వేగంగా గొంతులోకి వెళ్ళిపోతాయి. దాని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అదీగాక ఒకేసారి గుటగుట అని కాకుండా కొంచెం కొంచెంగా తాగడం మంచిది.

these are the ways to drink water

చల్లగా ఉన్న నీళ్ళు అస్సలు తాగవద్దు. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న మంచినీళ్ళు తాగాలి. లేదా కొంచెం వేడిపెట్టిన ( గోరువెచ్చని) నీళ్ళు మేలు చేస్తాయి. నీళ్ళు తాగడం మంచిదన్న కారణంగా మరీ ఎక్కువ తాగకూడదు. దానివల్ల మూత్రపిండాల మీద పనిపడి ఎక్కువసార్లు మూత్ర విసర్జనకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే నీళ్ళు కావాల్సినన్ని తాగాలి తప్ప మరీ అతిగా తాగ‌కూడ‌దు.

Admin

Recent Posts