హెల్త్ టిప్స్

నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా.. ఈ ఆహారాల‌ను తినండి..

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నిద్రరాక అవస్ధలు పడుతూంటారు. అయితే తేలికగా నిద్రపట్టాలంలే కొన్ని ఆహారాలు తినాలి. అవేమిటో చూడండి. పాల ఉత్పత్తులు – రాత్రిపూట నిద్ర పట్టక సతమతమవుతూంటే ట్రిప్టోఫాన్ కలిగిన ఆహారాలు తినటం మొదటి చర్య. ట్రిప్టోఫాన్ అనేది ఒక అత్యవసర ఎమినో యాసిడ్ ఇది శరీరంలోని సెరోటోనిన్ మరియు మెలటోనిన్ స్ధాయిలను అధికం చేస్తుంది.

రెండూ కూడా గాఢ నిద్ర పట్టించేవే. ఈ రెండూ వుండే ఆహారాలు పెరుగు, పాలు వంటి డైరీ ఉత్పత్తులు. ఓట్ ధాన్యపు గింజలు – సాధారణంగా ఓట్ గింజలను ఉదయంవేళ బ్రేక్ ఫాస్ట్ లో వాడతాము. అయితే, వీటిని సాయంత్రంవేళ స్నాక్స్ గా కూడా వాడవచ్చు. వీటిలో సహజమైన మెలటోనిన్ పుష్కలంగా వుండి గాఢ నిద్రను పట్టిస్తుంది. ఓట్ల ను పాలతో కలిపి తింటే అది ట్రిప్టోఫాన్ కూడా అందించి మరింత మెరుగుగా నిద్రకు పనిచేస్తుంది.

if you are not getting any sleep then take these foods

అవిసె గింజలు – వీటిలో నిద్రను కలిగించే ట్రిప్టోఫాన్ మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. నిద్రను నియంత్రించే సెరోటోనిన్ స్ధాయిని శరీరంలో అధికం చేస్తుంది. నిద్ర మాత్రమే కాక అవిసె గింజలు నిద్రను దూరం చేసే ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి తగ్గించటంలో తోడ్పడతాయి.

Admin

Recent Posts