ప్రతి ఒక్కరి వంటగదిలో తప్పకుండా ఉండే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. పసుపు వాడని వంటగది ఉండదని చెప్పవచ్చు. మనం చేసే ప్రతి వంటలోనూ ఎంత కొంత మోతాదులో పసుపును వేస్తూ ఉంటాము. పసుపును వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. పసుపును వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పసుపును వాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపును వాడడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు తరచూ పసుపును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అలాగే పసుపును తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల నుండి మనల్ని కాపాడడంలో సహాయపడతాయి. అలాగే పసుపులో కర్క్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ ను నశింపజేసి శరీర అవయవాలు దెబ్బతినకుండా చేయడంలో సహాయపడుతుంది. అదే విధంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా పసుపు మనకు దోహదపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో, గుండె జబ్బుల బారినపడకుండా చేయడంలో పసుపు మనకు ఉపయోగపడుతుంది.
అలాగే రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేయడంలో, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేయకుండా కూడా పసుపు దోహదపడుతుంది. పసుపును వాడడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. పసుపును వాడడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యి అందులో ఉండే పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి. అలాగే ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. అలాగే పసుపును వాడడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా పసుపును వాడడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోకుండా ఉంటాము. అదే విధంగా పసుపును వాడడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మ ఆరోగ్యం దెబ్బతినకుండా చేయడంలో, యువి కిరణాల నుండి చర్మాన్ని కాపాడడంలో పసుపు మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పసుపును వాడడం వల్ల కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు తొలగిపోయి శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే పసుపును వాడడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా పసుపు మనకు ఎంతో మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.