Turmeric And Pepper : మన వంటింట్లో ఉండే పదార్థాల్లో పసుపు, మిరియాలు చాలా ముఖ్యమైనవి. వీటిని అనేక రకాల వంటల్లో వాడుతూ ఉంటాం. పసుపును వాడడం వల్ల మనం చేసే వంటలు చక్కటి రంగును సంతరించుకుంటాయి. అలాగే పసుపులో ఔషథ గుణాలు ఉంటాయని మనందరికి తెలిసిందే. దీనిని వాడడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పసుపు సహజ సిద్దమైన యాంటీ బయాటిక్ గా పని చేస్తుంది. గాయాలను, దెబ్బలను తగ్గించడంలో పసుపు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పసుపు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.
అదే విధంగా మనం వంటల్లో వాడే మిరియాల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మిరియాల్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పసుపును, మిరియాలను విడివిడిగా వాడడం కంటే వీటిని కలిపి తీసుకోవడం వల్ల మనం అధిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. వీటిని ఎలా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గ్లాస్ లో గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో పావు టీ స్పూన్ పసుపును వేసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగి వెంటనే రెండు మిరియాలను నమిలి తినాలి. ఇలా మిరియాలను తినలేని వారు పసుపు నీటిలోనే చిటికెడు మిరియాల పొడిని కలిపి తాగాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా పసుపు, మిరియాల పొడిని కలిపి తీసుకున్న నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. చర్మం పై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఈ నీటిని తీసుకోవడం వల్ల గాయాలు. పుండ్లు కూడా త్వరగా మానుతాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోయి రక్తనాళాలు శుభ్రంగా మారుతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే పసుపును, మిరియాలను కలిపి తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే వారు ఇలా పసుపు, మిరియాల పొడి కలిపిన నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వీటిలో సహజ సిద్దమైన యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి నొప్పులను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. అలాతే ఈ నీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా రోజూ ఉదయం పరగడుపున పసుపు, మిరియాల పొడి కలిపిన నీటిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.