Turmeric Milk : మనలో చాలా మంది ప్రతిరోజూ పాలను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. పాలను తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ పాలను కొందరు ఉదయం పూట తాగితే మరికొందరు రాత్రి పడుకునే ముందు తాగుతారు. రాత్రి సమయంలో సాధారణ పాలను కాకుండా ఆ పాలలో పసుపును వేసి కలిపి తాగడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట పాలలో పసుపును కలిపి తాగడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలు, పసుపు.. ఇవి రెండూ కూడా సహజసిద్ధమైన పదార్థాలే. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
పసుపు కలిపిన పాలను తాగడం వల్ల శరీరానికి సంపూర్ణ పౌష్టికాహారం అందడంతోపాటు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం. ఇలా పసుపు కలిపిన పాలను తాగాలనుకునే వారు ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పాలను తీసుకుని వేడి చేయాలి. పాలు వేడయ్యాక అందులో చిటికెడు పసుపును వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పాలలో పంచదారకు బదులుగా బెల్లం, తేనె, పటిక బెల్లం వాటిని రుచికి తగినంతగా వేసి కలిపి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న పాలను రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తాగాలి. ఇలా పసుపు కలిపిన పాలను చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరైనా తాగవచ్చు.
పాలలో పసుపును కలుపుకుని తాగడం వల్ల శ్వాసకోస సంబంధిత సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. రాత్రి పూట ఊపిరి అందక ఇబ్బంది పడే వారు, గురక సమస్య ఉన్న వారు, దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడే వారు ఈ పాలను తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే ఈ పాలను తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. పడుకునే ముందు ఇలా పసుపు కలిపిన పాలను తాగడం వల్ల చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. తలనొప్పితో బాధపడే వారు ఈ పాలను తాగి పడుకోవడం వల్ల ఉదయం నిద్రలేచే సమయానికి తలనొప్పి తగ్గిపోతుంది.
అధిక బరువుతో బాధపడే వారు ఇలా రోజూ రాత్రి పసుపు కలిపిన పాలను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గుతారు. నెలసరి సమస్యలు, సంతాన లేమి సమస్యలు ఉన్న స్త్రీలు ఇలా పసుపు కలిపిన పాలను తాగడం వల్ల సమస్యలు తగ్గు ముఖం పడతాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ పాలలో తీపి పదార్థాలను వేసుకోకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. పచ్చ కామెర్లతో బాధపడే వారు ఇలా పాలలో పసుపును కలుపుకుని తాగడం వల్ల కామెర్ల వ్యాధి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. పిల్లలకు ఇలా తయారు చేసిన పాలలో బాదం గింజల పొడిని లేదా బాదం గింజలను నానబెట్టి వాటిని పేస్ట్ గా చేసి కానీ కలిపి ఇవ్వడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
ఇలా పసుపు కలిపిన పాలను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్ ల బారినపడకుండా ఉంటాం. ఇలా రాత్రి పూట గోరు వెచ్చని పసుపు కలిపిన పాలను తాగడం వల్ల శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ పాలను తాగడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ విధంగాపాలను తీసుకోవడం వల్ల మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి జీర్ణసంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ విధంగా రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పసుపు కలిపిన పాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కనుక ఈ పాలను ప్రతిరోజూ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.