Turmeric Milk : మనం ప్రతిరోజూ పాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. పాలల్లో ఎన్నో పోషకాలు, ఆహార ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని పాలను తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే సాధారణ పాలను తాగడానికి బదులుగా వీటిలో పసుపును కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పసుపు పాలను తాగడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
అయితే ఈ పసుపు పాలను ఎలా తయారు చేసుకోవాలి..ఎప్పుడు తాగాలి.. వీటిని తాగడం వల్ల మనకు కలిగేప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు పాలను తయారు చేసుకోవడానికి గానూ ఒక గ్లాస్ పాలను, పావు టేబుల్ స్పూన్ పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే దీని కోసం మన ఇంట్లో వాడే వంట పసుపును ఉపయోగించకూడదు. స్వచ్ఛమైన ఆర్గానిక్ పసుపును మాత్రమే ఉపయోగించాలి. ముందుగా ఒక గిన్నెలో పావు టేబుల్ స్పూన్ పసుపును వేసి ఈ పాలను మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ పాలను గ్లాస్ లోకి తీసుకుని అందులో చిటికెడు నుండి ఒక టేబుల్ స్పూన్ తేనెను కలుపుకోవాలి. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు తేనెను ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న పాలను పడుకోవడానికి అరగంట ముందు తాగాలి.
ఈ విధంగా పసుపు పాలను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ పాలను తాగడం వల్ల భవిష్యత్తులో షుగర్ రాకుండా ఉంటుంది. అలాగే పసుపు పాలను తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. చర్మ సమస్యలు, వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే ఈ పాలను తాగడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ పాలను తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మెదడు చక్కగా పని చేస్తుంది. అల్జీమర్స్, మతిమరుపు వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. నిద్రలేమి మన దరి చేరుకుండా ఉంటుంది. శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ విధంగా పసుపు కలిపిన పాలను తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఈ పాలను తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.