చాలా మంది నిత్యం ఉదయాన్నే నిద్ర లేవగానే బెడ్ టీ లేదా కాఫీ వంటివి తాగుతుంటారు. అలా తాగనిదే వారికి రోజు మొదలవదు. అయితే వాటికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. దీంతో శరీరానికి పోషణతోపాటు శక్తి కూడా లభిస్తుంది. ఈ క్రమంలో రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. అలాగే నిత్యం మన శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి.
నిత్యం ఉదయాన్నే పరగడుపునే తినదగిన ఆహారాల్లో బాదంపప్పు కూడా ఒకటి. ముందురోజు వీటిని నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పొట్టు తీసి తినాలి. బాదంపప్పులో ఉండే పోషకాలు బలాన్నిస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిత్యం మన శరీరంపై దాడి చేసే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. వ్యాధులు రాకుండా ఉంటాయి. పోషణ అందుతుంది. అనేక విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి.
ఉదయాన్నే బొప్పాయిపండు కూడా తినవచ్చు. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మలబద్దకం ఉండదు. గ్యాస్, అసిడిటీ రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఉదయం అరటిపండ్లను కూడా తినవచ్చు. వీటితో శరీరానికి శక్తి లభిస్తుంది. యాక్టివ్‌గా ఉండవచ్చు. వ్యాయామం చేసే వారికి ఎంతగానో మేలు చేస్తుంది.
ఉదయాన్నే పరగడుపునే బ్లాక్ రైజిన్స్ (నల్ల ద్రాక్ష కిస్మిస్) తినడం వల్ల శరీరానికి ఐరన్, మెగ్నిషియం, పొటాషియం లభిస్తాయి. దీని వల్ల పోషణ అందుతుంది. వీటిలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.