హెల్త్ టిప్స్

దీన్ని వాడితే అస‌లు జుట్టు రాల‌దు..!

ఈ సృష్టిలో ప్రతీ అమ్మాయి, ప్రతీ స్త్రీ, ప్రతీ మామ్మ గారు ఇష్టపడేది ఏముంటుంది…? ఏది ఎలా ఉన్నా సరే తమ జుట్టు మాత్రం అందంగా ఉండాలని ఆడాళ్ళు కోరుకుంటారు. జుట్టు చూసి ప్రపంచాన్ని జయించినంత ఫీల్ అవుతారు మరి. వాళ్లకు అదో పిచ్చి. ఫీల్ అవకండి లే నిజంగానే పిచ్చి కాదా…? కాని పాపం వాళ్ళను ఈ రోజుల్లో ఒక సమస్య తీవ్రంగా వేధిస్తుంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

అవును చిన్నప్పుడు ఒత్తుగా పెరిగిన జుట్టు ఇప్పుడు ఊడిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే వాళ్లకు జుట్టు ఊడిపోయే సమస్య మాత్రం తీరడం లేదు. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. కాలుష్యం పెరగడంతో పాటుగా, వాళ్ళు వాడే కొన్ని షాంపులు జుట్టు ఊడిపోవడానికి కారణంగా మారింది. ప్రకటనల్లో ఈ షాంపు వాడితే జుట్టు ఊడిపోయే అవకాశం ఉండదు, ఈ షాంపు వాడితే జుట్టు నిగ నిగాలాడుతుంది,

use soap nuts regularly you will not get hair fall

ఈ షాంపు వాడితే జుట్టులో చుండ్రు పోతుందని చెప్పడంతో ప్రతీ షాంపుని అమ్మాయిలు వాడేస్తున్నారు. దీనితో వాటిలోని రసాయనాలు జుట్టు ఊడిపోవడానికి కారణమవుతున్నాయి. ఇక ఆ రంగులు ఈ రంగులు అంటూ జుట్టుకి వేస్తూ అనవసరంగా పోగొట్టుకుంటున్నారు. షాంపు అనేది ఎప్పటికి మంచిది కాదు. గతంలో మంచిది ఏమో గాని ఇప్పుడు కాదు. రసాయనాలు ఎక్కువైపోయాయి. కాబట్టి కుంకుడు కాయ లేదా, ఎప్పుడు ఒకే కంపెనీ షాంపు వాడే ప్రయత్నం చేయండి, బీర్ షాంపు లేదు ఇంకో షాంపు లేదు. కుంకుడు కాయ ది బెస్ట్.

Admin

Recent Posts