Vegetable Juice For Diabetes : నేటి తరుణంలో మనలో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలల్లో షుగర్ కూడా ఒకటి. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. షుగర్ వ్యాధితో బాదపడే వారు తరుచూ రక్తపరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. కొందరు ఇంట్లోనే ఈ పరీక్షలు చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఆహారం తీసుకోవడానికి ముందు అలాగే ఆహారం తీసుకున్న రెండు గంటల తరువాత షుగర్ కు సంబంధించిన రక్తపరీక్షలు చేసుకోవాలి. అయితే మనం రాత్రి పూట స్వీట్స్ ను, అన్నాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉదయం పూట రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నట్టు వస్తుంది. అలాగే మధ్యాహ్నం పూట అన్నాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా షుగర్ ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది. అదే మనం పుల్కాలను తింటూ కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపరీక్షలల్లో షుగర్ తక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది.
కనుక తరుచూ చేసే రక్తపరీక్షల ద్వారా మనకు షుగర్ తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా ఖచ్చితంగా తెలుసుకోలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే తరుచూ చేసే రక్తపరీక్షలతో పాటు మూడు నెలలకొకసారి హెబిఎ1సి అనే రక్తపరీక్షను కూడా చేయించుకోవాలి. హెబిఎ1సి 7 నుండి 7.5 వరకు ఉంటే షుగర్ అదుపులో ఉన్నట్టు అర్థం. అదే 6 నుండి 7 మధ్యలో ఉంటే షుగర్ పూర్తిగా అదుపులో ఉందని అర్థం. అదే 6 కంటే ఇంకా తక్కుగా ఉంటే అసుల షుగర్ లేనట్టే అర్థమని నిపుణులు చెబుతున్నారు. అదే 7 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ ఎక్కువగా ఉన్నట్టని అర్థం. ఈ రక్తపరీక్షను మూడు నెలలకొకసారి చేయించుకుని షుగర్ అదుపులో ఉందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం.
అయితే మనం వాడే మందులతో పాటు ఆహార నియమాలను మార్చుకోవడం వల్ల కూడా హెబిఎ1సి టెస్ట్ లో మనం షుగర్ ను 5 లోపు లేదా 5 కంటే తక్కువగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ రెండు పూటలా మాత్రమే ఆహారాన్ని తీసుకుని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనం చాలా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చని వారు చెబుతున్నారు. రోజూ ఉదయం పూట 10 లోపు కేవలం నీటిని మాత్రమే తాగి ఉండాలి. 10 గంటలకు ఒక గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ లో 2 టీ స్పూన్ల తేనె కలిపి తీసుకోవాలి. జ్యూస్ తాగిన గంట తరువాత రెండు పుల్కాలను రెండు చప్పటి కూరలతో తీసుకోవాలి. కూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి ప్రయత్నించాలి. తరువాత గంటకొక గ్లాస్ నీటిని తాగుతూ ఉండాలి.
ఇలా సాయంత్రం 4 గంటల వరకు నీటిని తాగుతూ ఉండాలి. తరువాత ఒక గ్లాస్ కొబ్బరి నీటిని తాగాలి. అలాగే మొలకెత్తిన గింజలను, వాల్ నట్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలను నానబెట్టి తీసుకోవాలి. అలాగే పండ్లను కూడా తీసుకోవాలి. వీటిని తీసుకున్న తరువాత ఒక గంటపాటు వ్యాయామం చేయాలి. ఇలా 3 నెలల పాటు చేయడం వల్ల హెబిఎ1సి 6 లోపు వస్తుంది. దీంతో మనం వాడే మందుల మోతాదును కూడా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చని మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని షుగర్ కారణంగా అవయవాలు దెబ్బతినకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.