Vitamin C Juices For Immunity : రోజూ ఒక కప్పు తాగితే.. ఎంతో బ‌లం.. అంతులేని ఇమ్యూనిటీ..!

Vitamin C Juices For Immunity : మ‌న ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంద‌డంతో పాటు మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొందుతాము. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా పండ్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌నం ర‌క‌ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అలాగే వాటిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాము. మ‌న స‌మ‌యాన్ని బ‌ట్టి మ‌న‌కు న‌చ్చిన ప‌ద్ద‌తిలో ఈ పండ్లను తీసుకుంటూ ఉంటాము.

అయితే పండ్ల‌ను ఏ విధంగా తీసుకోవ‌డం మంచిది.. పండ్ల‌ను నేరుగా నమిలి తిన‌డం మంచిదా.. లేదా జ్యూస్ గా చేసి తీసుకోవ‌డం మంచిదా.. మ‌న‌లో చాలా మంది ఈ సందేహాన్ని క‌లిగి ఉంటారు. అయితే నిపుణులు దీని గురించి ఏమంటున్నారు. పండ్ల‌ను ఏ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పండ్ల‌ను నేరుగా నమిలి తీసుకోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. జ్యూస్ గా చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న స‌మ‌యం ఆదా అవుతుందే త‌ప్ప వాటిలో ఉండే ఫైబ‌ర్ మ‌న శ‌రీరానికి అంద‌ద‌ని వారు చెబుతున్నారు.

Vitamin C Juices For Immunity take daily for many benefits
Vitamin C Juices For Immunity

అయితే మనం తియ్య‌గా ఉండే పండ్ల‌తో పాటు నారింజ‌, బ‌త్తాయి, క‌మ‌లా వంటి పుల్ల‌టి పండ్ల‌ను కూడా తింటూ ఉంటాము. ఇటువంటి పుల్ల‌టి పండ్ల‌ను తిన‌ప్పుడు వాటిలో ఉండే ఆమ్ల‌తత్వం కార‌ణంగా మ‌న దంతాల‌పై ఉండే ఎనామిల్ దెబ్బ‌తింటుంది. పుల్ల‌టి పండ్ల‌ను తిన్న చాలా సేప‌టి వ‌ర‌కు మ‌నం ఏ ఇత‌ర ఆహారాల‌ను తీసుకోలేము. క‌నుక ఇటువంటి పుల్ల‌టి పండ్ల‌ను జ్యూస్ గా చేసి తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిని జ్యూస్ గా చేసి తీసుకోవ‌డం వల్ల దంతాల‌పై ఉండే ఎనామిల్ దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది. అయితే ఈ పుల్ల‌టి పండ్ల‌ను జ్యూస్ గా చేసి తీసుకునేట‌ప్పుడు వెంట వెంట‌నే తాగ‌కుండా జ్యూస్ ను కొద్ది కొద్దిగా చ‌ప్పిర‌స్తూ తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల నోట్లో ఉండే లాలాజ‌లం జ్యూస్ లో క‌లిసి వాటిలో ఉండే ఆమ్ల‌త‌త్వం త‌గ్గుతుంది.

అలాగే ఈ జ్యూస్ ల‌లో ఆమ్ల‌త‌త్వం త‌గ్గ‌డానికి తేనెను కూడా వేసుకుని తాగ‌వ‌చ్చు. పుల్ల‌టి పండ్ల‌ను ఈ విధంగా జ్యూస్ గా చేసి తీసుకోవ‌డం వ‌ల్ల వాటిలో ఉండే ఆమ్ల‌త‌త్వం కార‌ణంగా మ‌న దంతాల‌కు, అలాగే జీర్ణాశ‌యానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని వాటిలో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరానికి చ‌క్క‌గా అందుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. పండ్ల‌ను నేరుగా న‌మిలి తిన‌డ‌మే మంచిదని అయితే తియ్య‌టి పండ్ల‌ను బాగా న‌మ‌లి తినాల‌ని, పుల్ల‌టి పండ్లను మాత్రం జ్యూస్ గా చేసి చ‌ప్ప‌రిస్తూ తాగాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts