Poha Balls : అటుకుల‌తో ఇలా పోహా బాల్స్ చేసి తినండి.. అంద‌రికీ న‌చ్చుతాయి..!

Poha Balls : మ‌నం అటుకుల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకుల‌తో స‌లుభంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో పోహా బాల్స్ కూడా ఒక‌టి. అటుకుల‌తో చేసే ఈ బాల్స్ రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని స్నాక్స్ గా లేదా అల్పాహారంగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అలాగే వీటిని త‌యారు చేయడానికి మ‌నం ఎక్కువ‌గా నూనెను కూడా ఉప‌యోగించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పోహా బాల్స్ ను త‌క్కువ నూనెతో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పోహా బాల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దొడ్డు అటుకులు – ఒక క‌ప్పు, ఉడికించిన బంగాళాదుంప – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు -త‌గినంత‌, కారం – అర టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు -ఒక రెమ్మ‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌చ్చా ప‌చ్చ‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 3.

Poha Balls recipe in telugu make in this method
Poha Balls

పోహా బాల్స్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో అటుకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి రెండు నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఎక్కువ‌గా ఉన్న నీటిని తీసేసి అటుకుల‌ను చేత్తో లేదా జార్ లో వేసి మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఈ అటుకుల్లో బంగాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌న్నింటిని వేసి క‌లుపుకోవాలి. త‌రువాత చేతుల‌కు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా అటుకుల మిశ్ర‌మాన్నితీసుకుంటూ నిమ్మ‌కాయంత ప‌రిమాణంలో బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత స్ట‌వ్ మీద పొంగ‌నాల గిన్నెను ఉంచి అందులో నూనె వేసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక పోహా బాల్స్ ను వేసి కాల్చుకోవాలి. వీటిని గుండ్రంగా అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా ఇష్టం లేని వారు నూనెలో వేసి డీప్ ఫ్రైగా కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే పోహా బాల్స్ త‌యారవుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా అప్ప‌టిక‌ప్పుడు రుచిగా, ఆరోగ్య‌క‌రంగాఈ పోహ బాల్స్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D