Footwear : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల చెప్పులను ధరిస్తున్నారు. టెక్నాలజీ యుగం కావడంతో మోడ్రన్ చెప్పులు వివిధ వెరైటీల్లో లభిస్తున్నాయి. అందులో భాగంగానే ఎవరైనా సరే తమ అభిరుచులు, ఇష్టాలు, స్థోమతకు అనుగుణంగా చెప్పులను కొని ధరించడం చేస్తున్నారు. అయితే వాస్తవానికి వారంలో ఏదైనా ఒక రోజు కనీసం ఒక కిలోమీటర్ దూరం మేర చెప్పుల్లేకుండా నడవాలట. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వారానికి ఒక రోజు ఒక కిలోమీటర్ దూరం మేర చెప్పుల్లేకుండా నడిస్తే అనేక లాభాలను పొందవచ్చు. దీంతో శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది. నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా, ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా కుచ్చుకోవడం ద్వారా, మీ బీపీ కంట్రోల్ అవుతుంది. ఏదో కొత్త స్పర్శను కాలి పాదాలు పొందడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. సహనం పెరుగుతుంది.
మానవుని పాదాల్లో 72వేల నరాల కొనలు ఉంటాయి. ఎక్కువసేపు పాదరక్షలు వాడటం వల్ల సున్నితమైన ఈ
నరాలు చచ్చుబడిపోతాయి. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి యాక్టివ్ గా ఉంటాయి. దీంతో అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి. ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ఇలా నడవడం గురించి చెబుతారు. కనుక వారంలో కనీసం ఒక రోజు అయినా సరే ఒక కిలోమీటర్ దూరం మేర చెప్పులు వేసుకోకుండా నడవండి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.