Ghee : నెయ్యి వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా.. అంద‌రూ తీసుకోవాలి..!

Ghee : ఎదిగే పిల్ల‌ల‌కు పౌష్టికాహారం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా పాలు, పెరుగు, నెయ్యి వంటివి వారి ఎదుగుద‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పాల త‌రువాత పిల్ల‌ల పెరుగుద‌ల‌కు,ధృడ‌త్వానికి ఉప‌యోగ‌ప‌డేది నెయ్యి. చాలా మందికి నెయ్యితో తినే అల‌వాటు ఉంది. పూర్వకాలంలో పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వంటి వాటి కోసం ఆవును లేదా గేదెను ఇంట్లో పెంచుకునే వారు. వాటికి కావ‌ల్సిన అన్ని స‌దుపాయ‌ల‌ను అందిస్తూ వాటితో ఎన్నో లాభాల‌ను పొందేవారు. నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల శ‌రీరానికి ఎన్నో పోష‌కాలు అందుతాయి. నెయ్యిని వంట‌కాల్లో లేదా నేరుగా కూడా వాడ‌వ‌చ్చు. వ‌రీరంలో రోనిరోధ‌క శ‌క్తిని పెంచే గుణం నెయ్యికి ఉంది. రోజుకు రెండు నుండి మూడు టీ స్పూన్ల నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

నెయ్యిలో స్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నందున్న కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తుంది. నెయ్యిలో ఔష‌ధ గుణాల‌తో పాటు పోష‌కాలు కూడా ఎక్కువ‌గా ఉన్నాయి. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స‌మ‌స్య వ‌స్తుంద‌ని చాలా మంది భావిస్తారు. కానీ ఇది అంద‌రిని బాధించ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ముందు నుండి కొలెస్ట్రాల్ తో బాధ‌ప‌డే వారు నెయ్యి వాడ‌కాన్ని త‌గ్గించాలి. ఒక్కోసారి శ‌రీరంలో కొవ్వు శాతం పెర‌గ‌డానికి శారీర‌క మార్పులు, ఇత‌ర ఆహార ప‌దార్థాలు కూడా కార‌ణ‌మ‌వుతాయి. బ‌ల‌హీనంగా ఉన్న వారు నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాన్ని పొందుతారు. పితాన్ని, వాతాన్ని కూడా నెయ్యి త‌గ్గిస్తుంది. చ‌ర్మానికి నెయ్యి మంచి కాంతిని ఇస్తుంది.

we must take ghee daily for these amazing benefits
Ghee

మెద‌డు ప‌నితీరును పెంచే శ‌క్తి కూడా నెయ్యికి ఉంది. మ‌నం తీసుకున్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యేలా చేయ‌డంలో కూడా నెయ్యి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆక‌లి మంద‌గించిన‌ప్పుడు మిరియాల పొడిలో నెయ్యి క‌లిపి మొద‌టి ముద్ద‌లో తీసుకుంటే ఆక‌లి శక్తి పెరుగుతుంది. ఒక గ్లాస్ పాల‌ల్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి క‌లిపి పిల్లల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి. అర‌టి పండు గుజ్జులో కొద్దిగా పాలు,నెయ్యి వేసి క‌లిపి పిల్ల‌ల‌కు తినిపిస్తే అవ‌య‌వాలు ధృడంగా త‌యారవుతాయి. బరువు కూడా పెరుగుతారు. పొడి చ‌ర్మం క‌లిగి ఉన్న‌వారు, సోరియాసిస్ వంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పావు టీ స్పూన్ వేప గింజ‌ల పొడిలో పావు టీ స్పూన్ నెయ్యి వేసి మొద‌టి ముద్ద‌తో క‌లిపి తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఆయా చ‌ర్మ స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. కాలిన గాయ‌ల‌పై నెయ్యిని పై పూత‌గా రాయ‌డం వల్ల మ‌చ్చ‌లు ప‌డ‌కుండా గాయాలు త్వ‌ర‌గా మానిపోతాయి. ముక్కు నుండి ర‌క్త‌స్రావం అవుతున్న‌ప్పుడు ముక్కు రంధ్రాల్లో మూడు లేదా నాలుగు చుక్క‌ల నెయ్యి వేస్తే ముక్కు నుండి ర‌క్తం కార‌డం త‌గ్గుతుంది. అలాగే నెయ్యి లేదా వెన్న‌ను చ‌ర్మానికి రాసుకుని కొద్ది సేప‌టి త‌రువాత స్నానం చేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం మృదువుగా మారుతుంది. క్ష‌య‌, మ‌ల‌బ‌ద్ద‌కం, విరోచ‌నాలు, జ్వ‌రం వంటి వాటితో బాధ‌ప‌డే వారు నెయ్యికి దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా నెయ్యిని ఆహారంలో బాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. పిల్ల‌ల‌కు నెయ్యిని ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల కూడా చ‌క్క‌గా ఉంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts