Meals : భోజ‌నానికి ముందు త‌రువాత ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌రాదు.. చేస్తే ఏమ‌వుతుందంటే..?

Meals : మ‌న‌లో చాలా మంది జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు కూడా ఉన్నారు. ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. భోజ‌నం చేసిన త‌రువాత అలాగే చేయ‌డానికి ముందు కొన్ని ర‌కాల నియ‌మాల‌ను పాటించ‌క పోవ‌డం వల్ల మ‌నం ఈ జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నామ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నియమాల గురించి మ‌న పెద్ద‌లు చెప్పిన‌ప్ప‌టికీ మ‌నం వాటిని పెడ చెవిన పెడుతూ ఉంటాం. కానీ వాటి వెనుక ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయి. భోజ‌నం చేయ‌క ముందు అలాగే భోజ‌నం చేశాక చేయ‌కూడ‌నివి ఐదు ప‌నులు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ధ్యాహ్నం అలాగే రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత వెంట‌నే నిద్రించ‌కూడ‌దు. భోజ‌నం చేసిన వెంట‌నే నిద్రించ‌డం వ‌ల్ల మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వ్వ‌దు. దీని వ‌ల్ల క‌డుపులో మంట ఆరంభ‌మై క్ర‌మేపీ అది ఎసిడిటీకి దారి తీస్తుంది. ఇక భోజ‌నం చేసిన త‌రువాత చేయ‌కూడ‌ని వాటిల్లో రెండోవ‌ది పొగ తాగ‌డం. భోజ‌నం తిన్న త‌రువాత అది జీర్ణం కావ‌డానికి కొన్ని గంట‌లు ప‌డుతుంది. చాలా మంది తిన్న వెంట‌నే పొగ తాగుతూ ఉంటారు. దీని వ‌ల్ల నికోటిన్ శ‌రీరంలోకి చేరుతుంది. భోజ‌నంతోపాటు ఈ నికోటిన్ జీర్ణ‌మ‌వ్వ‌డానికి అధిక ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది.

we should not do these things before  and after meals
Meals

పొగ తాగ‌డం వ‌ల్ల ఆక్సిజ‌న్ స‌రిగ్గా అంద‌క అది క్యాన్సర్ కు కార‌ణ‌మ‌వుతుంది. ఇక మూడ‌వ‌ది భోజ‌నం చేయ‌డానికి ముందు పండ్లు తిన‌డం. భోజ‌నం చేయ‌డానికి ముందు పండ్లు తిన‌డం వ‌ల్ల అవి జీర్ణ‌మ‌వ్వ‌డానికి కొన్ని ర‌కాల ఎంజైమ్ లు వినియోగింప‌బడ‌తాయి. గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. మ‌నం తిన్న పండ్లు జీర్ణ‌మ‌వ్వ‌కుండానే మ‌ర‌లా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంది. అంతేకాకుండా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

ఇక భోజ‌నం చేసిన త‌రువాత చేయ‌కూడ‌ని వాటిల్లో నాలుగ‌వ‌ది స్నానం చేయ‌డం. భోజ‌నం చేసిన త‌రువాత వెంట‌నే స్నానం చేయ‌డం వ‌ల్ల కాళ్లలో ర‌క్త‌పోటు పెరుగుతుంది. పొట్ట భాగంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ త‌గ్గుతుంది. దాని ఫ‌లితంగా జీర్ణ‌వ్య‌వ‌స్థ మంద‌గించి క‌డుపు నొప్పికి దారి తీస్తుంది. ఒక అలాగే భోజ‌నం చేసిన త‌రువాత టీ తాగ‌కూడ‌దు. చాలా మంది భోజ‌నం చేసిన త‌రువాత టీ తాగే అల‌వాటును క‌లిగి ఉంటారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ భోజ‌నం త‌రువాత టీ తాగ‌కూడ‌దు.

మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరానికి శ‌క్తిని ఇస్తాయి. భోజ‌నం త‌రువాత టీ ని తాగ‌డం వ‌ల్ల టీ లోఉండే యాసిడ్లు ఈ శ‌క్తిని మ‌న శ‌రీరానికి అంద‌కుండా చేస్తాయి. దీని వ‌ల్ల ఆక‌లి మంద‌గించ‌డం, మోచేతులు, మోకాళ్లు విప‌రీతంగా లాగ‌డం, నీర‌సం, అనీమియా వంటి స‌మ‌స్య‌లు త‌లెతుత్తాయి. ఈ విధంగా భోజ‌నం చేసిన త‌రువాత, చేయ‌డానికి ముందు ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డకుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts