పూర్వకాలంలో మన పెద్దలు పూర్తిగా ఆకుల్లోనే భోజనం చేసేవారు. మన ఇళ్లలో అప్పట్లో అరటి చెట్లు అధికంగా ఉండేవి. దీంతో అరిటాకుల్లోనే భోజనం చేసే వారు. అందుకనే మన పెద్దలు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పటికీ చాలా చోట్ల చాలా మంది అరిటాకుల్లో భోజనం చేస్తుండడాన్ని మనం గమనించవచ్చు. అయితే అరిటాకుల్లో భోజనం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, అసలు దీని వల్ల లాభమేమిటి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరిటాకులో భోజనం చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. దీన్ని గౌరవానికి ప్రతీకగా భావించేవారు. అరటి ఆకుల్లో ఎన్నో ఔషధ విలువలు ఉంటాయి. అరిటాకుల్లో భోజనం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే వేడి పదార్థాలను వడ్డించగానే ఆకు మీద ఉన్న పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీంతో ఆహారానికి చక్కని రుచి వస్తుంది. అలాగే మన జీర్ణశక్తి కూడా వృద్ధి చెందుతుంది. అరిటాకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఎన్నో వ్యాధులను హరించే శక్తి అరిటాకుకు ఉంటుంది. కనుకనే అరిటాకుల్లో భోజనం చేయమని మన పెద్దలు చెబుతుంటారు.
ఇక అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల మెదడు, ప్రోస్టేట్, గర్భాశయ, మూత్రాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయట. అలాగే పార్కిన్సన్ అనే వ్యాధి రాకుండా చూసుకోవచ్చట. ఇక అరటి ఆకులను వాడిన తరువాత పడేస్తే సులభంఆ మట్టిలో కలసిపోతాయి. దీంతో మట్టి సారవంతం అవుతుంది. అది మొక్కలకు ఎరువుగా కూడా పనిచేస్తుంది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక ఆహారం విష పూరితమైతే అరటి ఆకులో వడ్డిస్తే వెంటనే నల్లగా మారిపోతుందట. ఇలా అరిటాకులో భోజనం చేయడం వల్ల చెప్పలేనన్ని లాభాలను పొందవచ్చు.