హెల్త్ టిప్స్

Drumstick Leaves : మున‌గ ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Drumstick Leaves : మున‌గ‌కాయ‌ల‌తో మ‌నం అనేక రకాల కూర‌ల‌ను చేసుకుని తింటుంటాం. ఇవి మ‌న‌కు చ‌క్క‌ని రుచిని మాత్ర‌మే కాదు, అనేక పోష‌కాల‌ను కూడా అందిస్తాయి. మున‌గ‌కాయ‌ల‌తో ఏ కూర చేసినా చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే నిజానికి మున‌గ‌కాయ‌ల క‌న్నా మున‌గ ఆకుల‌ను తింటే ఇంకా మ‌న‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మున‌గ ఆకుతో కూర చేసుకుని తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. ఎలా తీసుకున్నా స‌రే.. మున‌గ ఆకు మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌గ ఆకుల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. అందువ‌ల్ల శరీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో విట‌మిన్ సి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. మున‌గాకును తింటే చ‌ర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. ఈ ఆకుల్లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ ఆకుల‌లో ఉండే ఐర‌న్ రక్త‌హీన‌త‌ను పోగొడుతుంది. దీన్ని తింటే ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

 

మున‌గ ఆకుల్లో ఉండే కాల్షియం మ‌న శ‌రీరంలో ఎముక‌లు, దంతాల‌ను దృఢంగా చేస్తుంది. ఎముక‌లు బలంగా మారుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. మున‌గ ఆకుల‌ను రోజూ తీసుకుంటే క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఈ ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌వు. బాగా త‌ల‌నొప్పిగా ఉంటే మున‌గ ఆకు ర‌సాన్ని తాగితే వెంట‌నే త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌ధుమేహం ఉన్న‌వారు మున‌గ ఆకు ర‌సాన్ని రోజూ తాగితే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. ఇలా మున‌గాకుల‌తో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts