హెల్త్ టిప్స్

Couple Sleep : భార్య భర్తకు ఎడమవైపు ఎందుకు నిద్రపోవాలి..? కారణం ఏమిటో తెలుసా..?

Couple Sleep : ఎప్పుడైనా ఏదైనా పూజలు చేసుకున్నా, లేదంటే ఆలయానికి వెళ్ళినా భర్తకి ఎడమవైపుని భార్యని నిలబడమని చెప్తూ ఉంటారు. అయితే, నిద్రపోయేటప్పుడు కూడా భార్య భర్తకు ఎడమ వైపు పడుకోవాలని అంటారు. ఎందుకు ఇలా చేయాలి..? కుడివైపు ఎందుకు పడుకోకూడదు..? భార్య భర్తకు ఎడమవైపున ఎందుకు పడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ కూడా భార్యాభర్తకి ఎడమవైపు కూర్చోవాలని, ఎడమవైపుకి తిరిగి నిద్రపోవాలని చెప్తూ ఉంటారు. అలా ఎందుకు చెప్తారు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీకు కూడా, ఈ సందేహం ఉంటే వెంటనే తెలుసుకోండి.

పురాణాల ప్రకారం చూసినట్లయితే, పరమశివుడిని అర్ధనారీశ్వరుడు గా కొలుస్తారు. శివుడు తన ఎడమవైపు ఉండే అర్ధ భాగాన్ని పార్వతికి సమర్పించినట్లు, పురాణాలు చెప్పడం జరిగింది. అలా భార్యలు భర్తలకి ఎడమవైపు ఉండాలని అంటారు. అలా, హిందూ మతంలో భార్యని వామంగి అంటారు. అంటే ఎడమ అవయవం కలిగినది. పురుషుడు ఎడమ భాగాన్ని స్త్రీలో భాగంగా పరిగణిస్తారు.

wife must sleep left to husband know why

అందుకే, పూజలు వంటివి చేసుకున్నా ఏదైనా శుభకార్యాల్లో భర్త పక్కన కూర్చోవాలన్నా ఎడమవైపు భార్య కూర్చోవాలని చెప్తారు. ఇది దాని వెనక కారణం. అలానే, భార్యలు భర్తలకి ఎడమవైపు పడుకోవాలట. భార్య, భర్తకు ఎడమవైపున నిద్రపోవడం వలన శుభం కలుగుతుంది. వైవాహిక జీవితాన్ని ఆనందంగా సంతోషంగా సాగిస్తారు.

భార్య భర్త కి ఎడమవైపు పడుకోవడం వలన, భర్త ఆరోగ్యం కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. పూజలు చేసినప్పుడు మొదలైన కార్యక్రమాలు చేసినప్పుడు భార్య భర్తకు ఎడమవైపున కూర్చోవాలి. చాలామంది, ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు కానీ అర్థం తెలియకపోయి ఉండవచ్చు. అయితే, నిజానికి దీని వెనుక అర్థమైతే ఇది. సో, ఎప్పుడూ కూడా ఇలా ఎడమ వైపు భార్యలు ఉండడం అలానే ఎడమవైపు నిద్ర పోవడం మంచిది.

Admin

Recent Posts