Amla Benefits In Winter : ఆరోగ్యానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిలో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా, ఉసిరిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఊసరి ని తీసుకుంటే చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఎన్నో పోషక విలువలు ఉసిరిలో ఉంటాయి. ఉసిరిని చలికాలంలో తీసుకుంటే, ఎంతో ఉపయోగముంటుంది. ఉసిరికాయ చలికాలంలో విరివిగా లభిస్తుంది. ఒక్క ఉసిరికాయ, రెండు నారింజ పండ్లతో సమానము. ఉసిరి కొంచెం వగరు పులుపు తో ఉంటుంది. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది.
విటమిన్ సి లోపంతో బాధపడే వాళ్ళు, ఉసిరిని ఎక్కువ తీసుకుంటే మంచిది. రెగ్యులర్ గా, ఉసిరిని తీసుకుంటే, పేరుకుపోయిన కొవ్వులని కరిగించుకోవచ్చు. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలని తగ్గించి, యవ్వనంగా ఉండేటట్టు చేస్తుంది ఉసిరి. ఫైబర్ కూడా ఉసిరిలో ఎక్కువ ఉంటుంది. పేగు కదలికలని మెరుగుపరుస్తుంది.
మలబద్ధకం సమస్య నుండి కూడా దూరంగా ఉంచుతుంది. ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. ఎముకలు కూడా బలంగా ఉంటాయి. మహిళల్లో మెనోపాజ్ సమస్యలు తగ్గుతాయి. షుగర్ ఉన్న వాళ్ళు, ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఒక గ్లాస్ నీళ్లలో ఒక గ్రాము ఉసిరి పొడి, కొంచెం పంచదార కలిపి తీసుకుంటే, గ్యాస్ సమస్య తగ్గుతుంది.
రోగనిరోధక శక్తిని కూడా ఉసిరి పెంచుతుంది. అంతేకాకుండా ఉసిరికాయలను తీసుకోవడం వలన బరువు తగ్గడానికి కూడా అవుతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, ఉసిరిని రెగ్యులర్ గా, తీసుకోవడం మంచిది. ఉసిరికాయలను ముక్కలు కింద చేసుకుని ఎండబెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు అప్పుడు ఏడాది మొత్తం కూడా ఉసిరిని తీసుకోవచ్చు. చూశారు కదా ఉసిరి వల్ల లాభాలని, మరి ఈ సమస్యలేమీ లేకుండా ఉండాలంటే, రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.