హెల్త్ టిప్స్

White Bread : వైట్ బ్రెడ్ ని తింటున్నారా..? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..!

White Bread : చాలామంది వైట్ బ్రెడ్ ని తీసుకుంటూ ఉంటారు. అల్పాహారం కింద వైట్ బ్రెడ్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈజీగా అల్పాహారాన్ని రెడీ చేసుకోవడానికి వీల‌వుతుంది. పైగా టేస్టీగా కూడా మనం చేసుకోవచ్చు. శాండ్ విచ్‌లు, బ్రెడ్, జామ్ వంటి వాటిని వైట్ బ్రెడ్ తో సులభంగా చేసుకోవచ్చు. పైగా ఎక్కువ టైం పట్టదు. వైట్ బ్రెడ్ ని తయారు చేయడానికి గోధుమ పిండిని అలానే వివిధ రసాయనాలని ఉపయోగిస్తూ ఉంటారు. కనుక, పిండి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దీన్ని తయారు చేయడానికి, పారాక్సైడ్ క్లోరిన్, డయాక్సైడ్ పొటాషియం, బ్రోమేట్ వంటి రసాయనాలని పిండిలో కలపడం జరుగుతుంది.

తర్వాత శుద్ధి చేసిన పిండి పదార్థాలను కలుపుతారు. ఈ కెమికల్స్ అన్నీ కూడా తక్కువ పరిమాణంలో ఉపయోగించబడతాయి. అయితే, దీని వలన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. అన్ని రకాల బ్రెడ్ లలో కూడా క్యాలరీలు ఒకే విధంగా ఉంటాయి. తెల్ల బ్రెడ్‌లో చూసినట్లయితే, 77 క్యాలరీలు ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ అయితే, ఎక్కువ ఉంటుంది. రోజు వైట్ బ్రెడ్ ని తీసుకుంటే, కొన్ని సమస్యలు తప్పవు. వైట్ బ్రెడ్ లో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.

if you are eating white bread then you will get these problems if you are eating white bread then you will get these problems

గ్లూకోస్ ని వేగంగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని ఇది పెంచుతుంది. షుగర్ ఉన్నవాళ్లు, వైట్ బ్రెడ్ తీసుకోవడం మంచిది కాదు. గుండె జబ్బులు, నరాల నష్టం, మూత్రపిండాల సమస్యలు వంటివి కలిగిస్తుంది. వైట్ బ్రెడ్ ని తీసుకోవడం వలన బరువు కూడా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, అస్సలు వైట్ బ్రెడ్ ని తీసుకోకూడదు.

వైట్ బ్రెడ్ ని తీసుకోవడం వలన కేవలం శారీరక మార్పులే కాదు. మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం వైట్ బ్రెడ్ ని తీసుకోవడం వలన మానసిక సమస్యల్ని కూడా గుర్తించారు. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో డిప్రెషన్ కి దారితీస్తుందని కనుగొన్నారు. అలసట, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వీళ్ళలో ఉన్నట్లు గుర్తించారు. కనుక వైట్ బ్రెడ్ ని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. అనవసరంగా ఇబ్బంది పడాలి.

Admin

Recent Posts