Taping Toes : హై హీల్స్ వేసుకోవడం, స్థూలకాయం, ఎక్కువ సేపు నిలబడి ఉండడం, తిరగడం.. ఇలా కారణాలు ఏమున్నా నేడు అధిక శాతం మంది కాలి నొప్పులతో బాధ పడుతున్నారు. ప్రధానంగా రాత్రి పూట వీటి బాధ మరింత వర్ణనాతీతం. ఈ క్రమంలో పెయిన్ కిల్లర్‌లు, స్ప్రేలు వాడే బదులు కింద ఇచ్చిన ఓ చిట్కా పాటిస్తే చాలు. మీ కాలినొప్పి ఇట్టే తగ్గిపోతుంది. ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెడికల్, సర్జికల్ దుకాణాల్లో రిజిడ్ స్పోర్ట్స్ టేప్ (Rigid Sports Tape) అని ఓ టేప్ దొరుకుతుంది. ఇది తక్కువ ధరకే లభిస్తుంది. 38 ఎంఎం మందం కలిగి స్టిఫ్‌గా ఉంటుంది.
ఈ టేప్‌ను తీసుకుని కాలి చూపుడు వేలికి, మధ్య వేలికి కలిపి ప్లాస్టర్‌లా వేయాలి. అయితే ఇలా రాత్రి పూట చేయాలి. ఎందుకంటే ఆ సమయంలోనే కదా మన కాళ్లు విశ్రాంత స్థితిలో ఉండేది. ఇలా కాలి వేళ్లకు టేప్ వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే తీసేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల కాళ్లలో వచ్చే సాధారణ నొప్పులు తగ్గిపోతాయి. అంతేకాదు పాదాలపై ఒత్తిడి ఎక్కువగా పడకుండా ఉంటుంది. నడిచే సమయంలో పాదాలు సరిగ్గా భూమిపై ఆనేలా ఓ ఆకృతి (పోస్చర్) డెవలప్ అవుతుంది. పాదాలు, కాళ్ల కింది భాగంలో అయిన గాయాలు త్వరగా మానేందుకు ఉపయోగపడుతుంది.
ఎక్కువ దూరం రన్నింగ్ చేసినా పాదాలపై ఒత్తిడి కలగకుండా ఉంటుంది. ఏవైనా క్రీడలు ఆడుతున్న సమయంలో ఇలా టేపింగ్ చేసుకుంటే వేళ్లపై అదనపు ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇది గాయాలు కాకుండా కూడా నిరోధిస్తుంది. అయితే టేపింగ్ చేసిన క్రమంలో వేళ్లు వాపుకు గురవడం, ఎరుపుగా మారడం, దురద రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫిజియోథెరపీ వైద్యున్ని సంప్రదించాలి. వైద్యుడి సలహా మేరకే టేపింగ్ వేసుకోవాలి.