Garlic Milk : వెల్లుల్లిని నిత్యం మనం పలు వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. దీంట్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలతోపాటు ఇంకా మన శరీరానికి ప్రయోజనాన్ని చేకూర్చే అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయని అందరికీ తెలిసిందే. దీంతోపాటు పాలను కూడా మనం రోజూ వాడుతూనే ఉంటాం. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా కూడా చెబుతారు. అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దంచి పాలలో వేసి ఉడకబెట్టి తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా..? దీని వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలలో వెల్లుల్లి రెబ్బలను ఉడక బెట్టి తాగడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఫ్లేవనాయిడ్స్, ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ లభిస్తాయి. విటమిన్ ఎ, బి1, బి2, బి6, సి విటమిన్, పొటాషియం, ప్రోటీన్లు, కాపర్, మాంగనీస్, పాస్ఫరస్, జింక్, సెలీనియం, కాల్షియం వంటి అనేక పోషకాలు ఈ మిశ్రమం ద్వారా మనకు చేరుతాయి. జ్వరం కారణంగా ప్లేట్‌లెట్లు తగ్గిపోతున్న వారికి మంచి ఔషధం. ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయి. ఇన్‌ఫెక్షన్లు వెంటనే తగ్గుముఖం పడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధ వ్యాధులు నయం అవుతాయి. లేని వారికి భవిష్యత్తులో రాకుండా ఉంటాయి.
పలు రకాల క్యాన్సర్లను నయం చేసే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ కణతుల వృద్ధి తగ్గుతుంది. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే వృద్ధాప్య ఛాయలు కనిపించవు. యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కనుక యవ్వనంగా కనిపిస్తారు. రక్త పోటు, డయాబెటిస్ అదుపులోకి వస్తాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. లివర్ శుభ్రపడుతుంది. గాయాలు, పుండ్లు ఉన్న వారు ఈ మిశ్రమం తాగితే అవి త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మిశ్రమంలో రెట్టింపు యాంటీ బయోటిక్ లక్షణాలు ఉంటాయి.
రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుంది. మెటాబాలిజం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు నయం అవుతాయి. దంత సంబంధ సమస్యలు ఉంటే దూరం అవుతాయి. చర్మానికి అయిన ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు నయం అవుతాయి. చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. మొటిమలు పోతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలు విరిగిన వారికి ఈ మిశ్రమం తాగిస్తే త్వరగా అవి అతుక్కునే అవకాశం ఉంటుంది. ఇలా పాలు, వెల్లుల్లి మిశ్రమంతో మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక రోజూ ఈ మిశ్రమాన్ని తాగాల్సి ఉంటుంది.