హెల్త్ టిప్స్

కిస్మిస్‌ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో తింటే మంచిది..?

రోజు డ్రై ఫ్రూట్స్‌ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. వాల్నట్స్, జీడిపప్పు, బాదంపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌ను రోజు తినడం వల్ల మనకు విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. దీంతో శరీరానికి శక్తి అందుతుంది. అలాగే కిస్మిస్‌ల‌ను కూడా రోజు తినవచ్చు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలకు కిస్మిస్‌లు ఎంతగానో మేలు చేస్తాయి. కిస్మిస్‌ల‌ను రోజు తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే కిస్మిస్‌ల‌ను రోజు తింటారు కానీ వాటిని ఏ సమయంలో తినాలి అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. అందుకు నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కిస్మిస్‌ల‌ను రాత్రంతా నానబెట్టి మరసటి రోజు ఉదయం తినాలి. ఈ విధంగా తింటేనే ఎక్కువ ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఉదయం కిస్మిస్‌ల‌ను పరగడుపున తింటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. కిస్మిస్ లను ఉదయం తినడం వల్ల మనకు ఎన్నో పోష‌కాలు లభిస్తాయి. అలాగే కిస్మిస్ ల‌ను మీరు రోజు తయారు చేసుకునే స్మూతీలు, మిల్క్ షేక్ ల‌లో, సలాడ్స్ లో కలిపి కూడా తినవచ్చు.

what is the best time to take raisins

రోజుకు 7 నుంచి పది కిస్మిస్‌ల‌ను తిన్నా చాలు ఎన్నో లాభాలను పొందవచ్చు. ఇవి జీర్ణశక్తిని పెంచడమే కాకుండా రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తాయి. ఇంకా అనేక లాభాలు మనకు కిస్మిస్ ల‌ వల్ల కలుగుతాయి. కాబట్టి వీటిని రోజు తినాలి.

Admin

Recent Posts