బెల్లంను మనం తరచూ తీపి వంటకాలను తయారు చేయడంలో ఉపయోగిస్తుంటాం. చాలామంది బెల్లాన్ని రోజు తింటుంటారు. కొబ్బరి బెల్లం. లేదా పల్లీలు బెల్లం కలిపి తింటే రుచి ఎంతో బాగుంటుంది. బెల్లం తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ముఖ్యంగా వర్షాకాలంలో బెల్లం తింటే అనేక లాభాలు కలుగుతాయి. ఈ సీజన్లో అనేక వ్యాధులు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. కనుక బెల్లం తింటే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
వర్షాకాలంలో మనకు సహజంగానే జీర్ణ సమస్యలు వస్తుంటాయి. విరోచనాలు లేదా కడుపులో మంట, గ్యాస్ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను తగ్గించుకునేందుకు బెల్లం తినాలి. రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తింటే జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు. రోజు ఉదయం చిన్న బెల్లం ముక్క తినడం వల్ల శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోతాయి. శరీర ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మహిళలు రోజూ కొద్దిగా బెల్లం తింటే నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తీవ్ర రక్తస్రావం సమస్య నుంచి బయటపడవచ్చు.
తక్షణ శక్తి లభించాలంటే చిన్న బెల్లం ముక్కను తినాలి. దీంతో ఉత్సాహంగా మారుతారు. ఆక్టివ్ గా పని చేస్తారు. బెల్లంలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం లాంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మనకు హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. కణాలను రక్షిస్తాయి. బెల్లంను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ నియంత్రణలో ఉంటుంది. బెల్లంలో ఐరన్, ఫోలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. గర్భిణీలకు కూడా బెల్లం ఎంతగానో మేలు చేస్తుంది. కానీ డాక్టర్ సలహా మేరకు వారు బెల్లంను తీసుకుంటే మంచిది.