హెల్త్ టిప్స్

పిల్ల‌ల‌కు లంచ్‌ బాక్సుల్లో ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలాంటి స్నాక్స్‌ ఇవ్వాలి?

పిల్లలు నిత్యం చురుకుగా ఉంటూ చదువులో రాణించాలంటే వారికి ప్రతీ నాలుగు గంటలకు ఓ సారి సమతులమైన, పుష్టినిచ్చే ఆహారం తప్పనిసరి అందించాలి. కూల్‌డ్రింక్స్‌తో పాటు బిస్కెట్లు, చాక్లెట్లు వదిలేయాలి. ఇంటిల్లిపాదీ తినే ఆహారపదార్థాల్లో ఉప్పు వినియోగాన్ని తగ్గించి, పిల్లల ఆహారంలో పప్పు వినియోగాన్ని పెంచాలి. స్కూలు దగ్గర ఏదో ఒకటి కొని తినే వారి కంటే ఇంట్లో ఉదయాన్నే అల్పాహారం తిన్న పిల్లలు చదువులో రాణిస్తున్నారని పరిశోధనల్లో తేలింది. పిల్లల ఆసక్తిని బట్టి వారికి ఇష్టమైన ఆహారపదార్థాలనే పుష్టినిచ్చే ఆకుకూరలు, కూరగాయలతో కలిపి వండి పెట్టవచ్చు. ఉ

దాహరణకు కొంతమంది పిల్లలు దోసెలంటే ఇష్టపడతారు. అలాంటి వారికి పాలకూర, తోటకూర, మెంతికూర లాంటి పలురకాల ఆకుకూరలు కలిపి గ్రైండ్‌ చేసి దోసెలు వేయవచ్చు. లేకుంటే చట్నీలోనూ ఆకుకూరలు కలిపి చేయవచ్చు. దీనివల్ల పిల్లలకు పౌష్టికాహారం అందుతుంది. క్యారెట్‌, బఠానీలు, బీన్స్‌లతో ఫ్రైడ్‌రైస్‌ చేసి లంచ్‌బాక్సులో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. క్యారెట్‌, బీన్స్‌, పచ్చి బఠానీలు, బీట్‌రూట్‌లను చిన్నచిన్న ముక్కలు చేసి ఇడ్లీల్లో కలిపితే పోషక పదార్థాలు పిల్లలకు అందుతాయి.

what type of foods you have tp put in kids lunch box

చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా పల్లీలతో చేసిన ఉండలు, చిక్కీలు, నువ్వులు, బెల్లంతో చేసిన ఉండలు పెట్టండి. ఇంటికొచ్చాక పిల్లలకు శనగలు, పల్లీలు, బఠానీలు గుప్పెడు ఇవ్వాలి. అన్నం, పంచదార, ఎగ్‌లతో పుడ్డింగ్‌ చేసి పెడితే పెరిగే పిల్లలకు మంచిది. మురుకులైనా ఏ పిండి వంటలైనా ఇంట్లో చేసుకోవాలి తప్ప, సూపర్‌మార్కెట్‌, బజార్‌లలో దొరికే పదార్థాలను పిల్లలకు పెట్టవద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు హైదరాబాద్‌ మిక్స్‌ అన్న పేరుతో ఓ ఆహార మిశ్రమాన్ని రూపొందించారు. గోధుమలు, వేయించిన శనగపప్పు, వేరుశనగపప్పు, బెల్లాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Admin

Recent Posts