డయాబెటీస్ ను నియంత్రణలో వుంచకపోతే, శరీరంలో అనేక అవయవాలు పాడైపోతాయి. కళ్ళు, కిడ్నీలు, నరాలు మొదలైనవి తక్షణమే తమ ప్రభావాన్ని చూపుతాయి. రక్త సరఫరా సమస్య అవుతుంది. అత్యధిక రక్తపోటు, అధిక బరువు, కొలెస్టరాల్ పెరగటం, రక్తనాళాలు గడ్డకట్టి సరఫరా నిదానించడం వంటివి వస్తాయి. డయాబెటిస్ వ్యాధి కళ్ళను గుడ్డిగా కూడా చేయగలదు. సత్వర వైద్యంతో నివారించవచ్చు. ప్రారంభంలో లక్షణాలు తెలియకపోవచ్చు. కనుక కంటి రెటీనా భాగాన్ని పరీక్షించాలి. కంటి డాక్టర్ తో మీకు డయాబెటిస్ వుందని చెప్పాలి. డయాబెటీస్ రోగులు కాళ్ళకు తీసుకోవలసిన జాగ్రత్తలు.
డయాబెటీస్ నియంత్రణలో లేకుంటే పాదాల సమస్యలు సాధారణంగా మూడు రకాలు వుంటాయి. 1. డయాబెటీస్ నరాలు పాడు చేస్తుంది. కనుక గాయమైనా తెలియదు. 2. రక్త సరఫరా సరిగా వుండదు కనుక నయమవ్వటం లేటు. 3. షుగర్ నియంత్రణలో వుండదు కనుక ఇన్ ఫెక్షన్ బాగా వ్యాపిస్తుంది. పాదాలు ఎపుడూ పొడిగా శుభ్రంగా వుంచుకోవాలి. గోళ్ళు కత్తిరించుకోవాలి. క్రీములు రాసి మెత్తగా వుంచాలి. పాదాలు ఎరుపెక్కితే, అతిగా నొప్పి పెడితే, పుండు పడితే, పాదాలు ఉభ్బి రంగుమారితే డాక్టర్ ను సంప్రదించండి. ఆలస్యం చేస్తే పాదాలు తీసివేసే పరిస్ధితి కూడా వస్తుంది.
డయాబెటిక్ రోగులకు కిడ్నీలకు కలిగే డామేజీ వెంటనే తెలియదు. కనుక కనీసం సంవత్సరానికోసారి కిడ్నీలు చెక్ చేయించాలి. దీనికి గాను మూత్రము, బ్లడ్ లో ప్రొటీన్ చెక్ చేస్తారు. కిడ్నీలు పాడైతే మూత్రంలో ప్రొటీన్ వస్తుంది. అధికంగా ప్రొటీన్ పోతే కిడ్నీ డామేజీ అవుతుంది. దీనికి వెంటనే ట్రీట్ మెంట్ తీసుకోవాలి. డయాబెటీస్ వలన జరిగే అవయవ నష్టాలు చాలా తీవ్రంగా వుంటాయి. కనుక మీ శరీరాన్ని ఎప్పటికపుడు చెక్ చేయించుకొంటూ తగిన వైద్యం చేయించుకోవడం మంచిది.