హెల్త్ టిప్స్

ఉద‌యం యాపిల్ జ్యూస్ తాగితే స్లిమ్ అవుతార‌ట‌..!

మహిళలు సాధారణంగా ఉదయంపూట వారి పనుల ఒత్తిడిలో అల్పాహారంపై శ్రద్ధచూపరు. కొందరైతే, ఏకంగా అల్పాహారం మానేసి ఏకంగా మధ్యాహ్నం భోజనంతో సరిపెట్టుకుంటుంటారు. ఇలా చేయడం ద్వారా ఊబకాయం తప్పదని న్యూట్రీషన్లు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ అల్పాహారం తీసుకోవడం ఆవశ్యకమని వారు సూచిస్తున్నారు. ఉదయం వేళలో సాధారణంగా తినే ఇడ్లీ, దోస, పూరీ, వడ మొదలైన ఉడికించిన లేదా వండిన ఆహారం కంటే యాపిల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా స్లిమ్ అవుతారని నాట్టింగ్‌హామ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు.

ఇంకా షుగర్‌తో కూడిన డ్రింక్, పాలు, వైట్ బ్రెడ్, జామ్ వంటివి కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా ఉడికించిన లేదా వండిన అల్పాహారం తీసుకున్న వారి రక్తంలో గ్లూకోజ్ నిల్వలు అధికంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

drink apple juice in the morning you will become slim

అంతేకాక అల్పాహారాన్ని తక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే కూడా ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనుక మహిళలు ఉదయంవేళ అల్పాహారం అశ్రధ్ధ చేయకుండా తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం అద్భుతంగా వుండగలదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.

Admin

Recent Posts