మన శరీరాన్నిఆరోగ్యంగా ఉంచేందుకు అనేక రకాల ఆయుర్వేద ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చ్యవన్‌ప్రాశ్ లేహ్యం ఒకటి. ఇది మనకు ఎక్కడైనా సులభంగా లభిస్తుంది. అయితే చ్యవన్‌ప్రాశ్ లేహ్యాన్ని ఎవరు తినాలి ? ఎందుకు తినాలి ? దీంతో ఏమేం లాభాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* చ్యవన్‌ప్రాశ్ లేహ్యంలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రావు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* చ్యవన్‌ప్రాశ్‌ను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
* రోజూ నీరసంగా, అలసటగా ఉందని భావించే వారు చ్యవన్‌ప్రాశ్ లేహ్యాన్ని తినడం మంచిది. దీంతో శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు.
* చ్యవన్‌ప్రాశ్ ను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
* చ్యవన్‌ప్రాశ్ ను తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి.
* చ్యవన్‌ప్రాశ్ వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. రక్తహీనత తగ్గుతుంది.
* చ్యవన్‌ప్రాశ్ ను తింటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని కణాలు ఉత్తేజంగా మారుతాయి.
చ్యవన్‌ప్రాశ్ ను రోజూ ఉదయం పరగడుపునే ఒక టీస్పూన్ తినాలి. తరువాత గోరు వెచ్చని పాలను తాగాలి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ లేహ్యాన్ని ఎవరైనా తినవచ్చు.