ప్రతిరోజూ రోజు చివరలో అలసినట్లు భావిస్తున్నారా? జీవితాన్ని పూర్తిగా ఆనందించలేకుండా వున్నారా? మీ జీవన విధానం కొద్దిపాటి మార్పులు చేసుకుంటే, ప్రతిరోజూ ఎంతో శక్తివంతంగా వుండి జీవితాన్ని పూర్తిగా ఆనందించే అవకాశం వుంటుంది. దానికిగాను కొన్ని చిట్కాలు పరిశీలించండి.
ఆహారం – ఆరోగ్యకర ఆహారం మాత్రమే తినండి. జంక్ ఫుడ్ మానేయండి. తినే సమయం – భోజనానికి భోజనానికి మధ్య తగిన సమయం ఇవ్వండి. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ తింటూ వుండకండి. మీరు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు శరీరానికి ఒక అవకాశం ఇవ్వండి. శారీరక శ్రమ – మీరు శారీరకంగా ఎంత శ్రమ పడితే, అంత చురుకుగా వుంటారు.
విశ్రాంతి – శరీరం అలసి విశ్రాంతి కోరుతోందా? వెంటనే దానికి కనీసం పది నుండి 12 గంటల విశ్రాంతినివ్వండి. దీనిలోనే కనీసం 7 నుండి 8 గంటలు నిద్రకు కేటాయించండి. నిద్రలో శరీరానికవసరమైన పూర్తి శక్తి దొరుకుతుంది. ఒత్తిడి తగ్గించుకోండి – తేలికైన హాబీలు, ఇతర కార్యక్రమాలతో ఒత్తిడి తగ్గించి శరీరానికి విశ్రాంతి కలిగించండి.