హెల్త్ టిప్స్

స‌గం నిమ్మకాయ ముక్క, మీ అధిక బ‌రువును త‌గ్గించును ఎంచక్కా…! నెలలో వచ్చును ఫలితం..

నేడు అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య అధిక బ‌రువు. కార‌ణాలు ఏమున్నా ఇప్పుడు చాలా మంది అధిక బ‌రువుతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీని వ‌ల్ల ఇతర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే మీకు తెలుసా..? అధిక బ‌రువు రావ‌డానికి గ‌ల ప్ర‌ధాన కార‌ణాల్లో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోవడం కూడా ఒక‌ట‌ని. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. నిత్యం మ‌నం తింటున్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాకున్నా బ‌రువు పెరుగుతారు. తిన్న ఆహారం జీర్ణం కాక‌పోతే అందులో ఉండే పోష‌కాల‌ను శరీరం గ్ర‌హించ‌దు. ఈ క్ర‌మంలో శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాల‌ను, ముఖ్యంగా కొవ్వును క‌రిగించేందుకు శ‌రీరం వ‌ల్ల త‌గిన శ‌క్తి ఉండ‌దు. దీంతో బ‌రువు విపరీతంగా పెరిగిపోతారు.

అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే చిన్న ట్రిక్‌ను పాటిస్తే మీ శ‌రీర జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డ‌మే కాదు, శ‌రీర మెట‌బాలిజం కూడా వేగవంతమ‌వుతుంది. త‌ద్వారా క్యాల‌రీలు ఖ‌ర్చ‌య్యే రేటు పెరిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. నిత్యం మ‌న ప‌లు ఆహారాల్లో నిమ్మ‌కాయ‌ను ఉపయోగిస్తూనే ఉంటాం. దీంట్లో విట‌మిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంద‌రికీ తెలుసు. నిమ్మ‌కాయ‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ కూడా మెరుగ‌వుతుంది. అయితే అదే నిమ్మ‌కాయ‌ను రోజూ ఒక సగం ముక్కను తీసుకుని వాడ‌డం వ‌ల్ల కూడా మీ శ‌రీరంలో అధికంగా ఉన్న బ‌రువు ఇట్టే త‌గ్గిపోతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

with only half lemon you can reduce your weight

ఒక నిమ్మ‌కాయ‌ను కోసి అందులో స‌గం ముక్క‌ను తీసుకోవాలి. ఇప్పుడు ఒక 100 ఎంఎల్ మోతాదులో నీటిని ఒక పాత్ర‌లో తీసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయాలి. అనంత‌రం ఆ నీటిలో ముందుగా తీసుకున్న నిమ్మ‌కాయ ముక్క‌ను పిండాలి. త‌రువాత ఆ నీటిని ప‌ర‌గ‌డుపునే తాగేయాలి. అనంత‌రం 30 నిమిషాల త‌రువాతే బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఇలా రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే నిమ్మ‌కాయ ర‌సాన్ని గోరు వెచ్చ‌ని నీటితో తాగుతుంటే మీ శ‌రీర జీర్ణప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. అంతేకాదు, మెట‌బాలిజం వేగ‌వంత‌మై క్యాల‌రీలు ఫాస్ట్‌గా ఖ‌ర్చ‌వుతాయి. దీంతో అధికంగా ఉన్న కొవ్వు ఇట్టే క‌రిగి బ‌రువు త‌గ్గిపోతారు.

Admin

Recent Posts