హెల్త్ టిప్స్

మాన‌సిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న మ‌హిళ‌లు ఇలా చేస్తే మంచిది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు&period; దీనికి కారణం వారు మల్టీ టాస్కింగ్ చేయడం ప్రధాన కారణం అని అంటున్నారు&period; వర్కింగ్ ఉమెన్ పై ఈ మానసిక ఒత్తిడి చాలా అధికంగా ఉందట&period; రిలేషన్ షిప్ ఇష్యూస్&comma; పిల్లల పెంపకం&comma; ఆఫీస్ ఇష్యూస్ ఇలా అనేక రకాల బాధ్యతలు మోయడం వారికి మానసిక ఒత్తిడిని పెంచుతున్నట్టు చెబుతున్నారు&period; అంతేకాదు సమాజంలో పురుషులకంటే స్త్రీలు తక్కువ అనే భావన వారిని పని ప్రాంతాల్లో&comma; ఇంట్లో మరింత మానసిక అనారోగ్యానికి గురి చేస్తోందని వాదిస్తున్నారు&period; అయితే స్త్రీలు మాత్రం తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో వెనుకబడి ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి&period; పని ఒత్తిడిలో పడి వారి మానసిక ఆరోగ్యం పై దృష్టి పెట్టట్లేదని నిపుణులు చెబుతున్నారు&period; కాలక్రమేణా ఇది వారిని మరింత అనారోగ్యానికి కృంగదీస్తుందని హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది స్త్రీలు పనిలో పడి తమకు ఇష్టమైన పనులు చేయడానికి&comma; తమపై తాము దృష్టి పెట్టడానికి సమయం కేటాయించడం లేదు&period; మహిళలు తమ మెంటల్ హెల్త్ కాపాడుకునే దిశగా కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయాలని వారు సూచిస్తున్నారు&period; స్త్రీలు మానసిక ఒత్తిడి నుండి బయట పడేందుకు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలని చెబుతున్నారు నిపుణులు&period; మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని హెచ్చరిస్తున్నారు&period; రోజువారి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మానసిక నిపుణులు మూడు సులువైన చిట్కాలు చెబుతున్నారు&period; ఇవి క్రమం తప్పకుండా పాటిస్తే మహిళలు ఎల్లప్పుడూ మానసిక ఆరోగ్యంతో ఉంటారని సూచిస్తున్నారు&period; మీ ఫీలింగ్స్&comma; ఎమోషన్స్ ఒక పుస్తకంలో రాయండి&period; అప్పుడు మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు అనే భావన మీలో ఉండదు&period; మీ భావాలను వ్యక్తపరిచేందుకు ఒక సులువైన మార్గం పుస్తకం ద్వారా దొరుకుతుంది&period; ఏం చెబితే ఎవరూ ఏమనుకుంటారు అని మనం చాలా విషయాలు బయటకు చెప్పుకోము&period; కానీ డైరీలో మనకు ఏమనిపిస్తే అది నిర్మొహమాటంగా రాసేయొచ్చు&period; ఇలా చేయడం వలన మనలో సానుకూల దృక్పథం పెరుగుతుంది&period; మనం చెప్పేది వినడానికి ఎవరూ లేరు అనే మనోవేదన దూరం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87426 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;woman&period;jpg" alt&equals;"woman who are facing mental issues do like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది మహిళలు తమ కోసం తాము సమయం కేటాయించరు&period; మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే కారణాల్లో ప్రధానమైనది వారు తమ పట్ల తాము కేర్ తీసుకోకపోవడం&period; ఇందుకు కారణం వారికి ఏకాంతంగా ఉండేందుకు తగిన సమయం దొరకకపోవడమే&period; వారి భావోద్వేగాలను రీసెట్ చేసుకోవడం చాలా ముఖ్యం&period; తమ జీవితానికి ఏది బాగా మేలు చేస్తుంది&quest; ఏది పని చేయదు అని తేల్చుకునేందుకు కూడా ఈ సమయాన్ని వారు ఉపయోగించుకోవచ్చు&period; చాలామంది మహిళలు సమస్య ఉన్నప్పుడు సహాయం అడగడానికి మొహమాటపడుతుంటారు&period; కానీ ఇది సరైన పద్ధతి కాదు&period; మహిళలు తమకు అవసరమని భావించినప్పుడు సహాయం కోరాలి&period; స్ట్రెస్ నుంచి ఉపశమనానికి అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి&period; కుటుంబ సభ్యులు&comma; సహోద్యోగుల నుంచి అవసరమైన సందర్భాల్లో సాయం పొందడంలో తప్పులేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts