హెల్త్ టిప్స్

ఎర్ర బెండ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలొదలరు!

నిత్యం అందుబాటులో ఉండే కూరగాయల్లో బెండకాయ కూడా ఒకటి. బెండకాయలో ఉన్న పోషక విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఎర్ర బెండకాయలో సాధారణ బెండకాయ కంటే అత్యధిక పోషక విలువలు దాగి ఉన్నాయని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఎర్ర బెండలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.అలాగే థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్ తో అన్ని రకాల విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

ఎర్ర బెండకాయను తరచు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీర పెరుగుదలకు అవసరమైన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ , ఫైబర్ వంటి పోషక విలువలు సమృద్ధిగా లభించి నిత్యం ఆరోగ్యవంతంగా జీవించడానికి సహాయపడతాయి.ఎర్ర బెండలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతాయి. తద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగి బీపి, గుండె జబ్బు వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.

wonderful health benefits of red okra

ఎర్ర బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట,నీరసం తొలగి శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి సమస్యలను నివారిస్తుంది. విటమిన్ ఈ చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి చక్కెర వ్యాధిని నియంత్రిస్తుంది.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఎర్ర బెండను తరచూ ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది.

Admin

Recent Posts