హెల్త్ టిప్స్

Weight Loss : పైసా ఖర్చు లేకుండా ఇలా బరువు తగ్గవ‌చ్చు.. కొవ్వు కూడా కరిగిపోతుంది..!

Weight Loss : ఈరోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. కొవ్వు కూడా ఎక్కువగా ఉండడంతో, చాలా ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గాలని, కొవ్వు కరగాలని రకరకాల టెక్నిక్స్ ని పాటిస్తున్నారు. అయితే, ఒంట్లో కొవ్వు కరగాలన్నా, బరువు తగ్గాలన్నా ఇలా చేయడం మంచిది. ఇలా చేయడం వలన సులభంగా కొవ్వు కరిగిపోతుంది. బరువు కూడా తగ్గిపోవచ్చు. గోరువెచ్చని నీళ్ళని తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.

గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే, బరువు తగ్గడం మొదలు అనేక ఇబ్బందులు దూరం అవుతాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు తాగలేక పోయినా ఫ‌రవాలేదు కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడైనా కచ్చితంగా, గోరువెచ్చని నీటిని అలవాటు చేసుకోవడం మంచిది. మనం ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఏమవుతుంది అంటే.. ఎక్కువ సార్లు యూరిన్ వస్తూ ఉంటుంది.

you can reduce your weight without single np of cost

ఎక్కువసార్లు యూరిన్ వచ్చిందంటే, సాల్ట్ బయటకు వెళ్ళిపోతుంది. సాల్ట్ బయటికి వెళ్ళినప్పుడు, బరువు తగ్గడానికి అవుతుంది. ఇలా ప్రతిదీ కనెక్ట్ అయి ఉంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వాళ్ళు వాటర్ ని ఎక్కువ తీసుకోవాలి. ఇలా నీళ్లు తీసుకోవడం, యూరిన్ పాస్ చేయడం వలన బరువు కూడా తగ్గడానికి అవుతుంది. అయితే, మామూలు నీళ్లు తాగడం వలన బాడీ యొక్క మెటబాలిక్ రేటు పెరగదు. అదే గోరువెచ్చని నీళ్లు తీసుకోవడం వలన బాడీ యొక్క మెటబాలిక్ రేట్ పెరుగుతుంది.

పొట్ట తగ్గడం, బరువు తగ్గడం, కొవ్వు క‌రగడం వంటివి జరుగుతాయి. గోరువెచ్చని నీళ్లు తాగడం వలన పేగులకి మామూలు రక్తప్రసరణ కంటే కొంచెం ఎక్కువ రక్త ప్రసరణ జరుగుతుంది. అర లీటర్ లేదా అంతకంటే ఎక్కువ గోరువెచ్చని నీళ్లు తాగడం వలన బాడీ మెటబాలిక్ రేట్ బాగా పెరుగుతుందని స్టడీ చెప్తోంది. ఇలా, ఈ విధంగా గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే, ఈ లాభాలని పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది.

Admin

Recent Posts