Bitter Gourd Juice : కాకరకాయలు మనకు సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. వీటితో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు కాకరకాయల్లో ఉంటాయి. కాకరకాయలను రోజూ తినడం ఇబ్బందిగానే ఉంటుంది. కనుక వీటిని జ్యూస్‌లా తీసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో కాకరకాయ రసం తాగుతుండాలి. చలికాలంలో ఈ రసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చలికాలంలో సహజంగానే చాలా మందికి అలర్జీలు వస్తుంటాయి. అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ కాలంలో కాకరకాయ రసం తాగడం వల్ల అలర్జీల నుంచి బయట పడవచ్చు. అలాగే శరీరానికి తగినంత వేడి లభిస్తుంది. దీంతో వెచ్చగా ఉండవచ్చు. చలిని తరిమికొట్టవచ్చు.
2. షుగర్ సమస్య ఉన్నవారికి ఈ సీజన్‌లో షుగర్ లెవల్స్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక వారు రోజూ కాకరకాయ రసాన్ని తాగితే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
3. చలికాలంలో చర్మం పగులుతుంది. కొందరికి తెల్లగా మారుతుంది. ఈ సమస్యలు తగ్గాలంటే రోజూ కాకరకాయ రసాన్ని తాగాలి.
4. చలికాలంలో మన జీవక్రియలు నెమ్మదిగా జరుగుతుంటాయి. దీంతో క్యాలరీలు తక్కువగా ఖర్చవుతాయి. కనుక కాకరకాయ రసం తాగితే జీవక్రియల రేటును పెంచవచ్చు. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఈ క్రమంలో శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
5. చలికాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, మలబద్దకం వంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అలాంటప్పుడు రోజూ కాకరకాయ జ్యూస్‌ను తాగడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
6. కాకరకాయ రసాన్ని రోజూ తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. లివర్, శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
7. ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కాకరకాయ రసం బాగా పనిచేస్తుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ముందుగానే అడ్డుకట్ట వేయవచ్చు.
ఇక కాకరకాయ రసం ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా కాయలను బాగా కడిగి శుభ్రం చేయాలి. తరువాత వాటిల్లో ఉండే విత్తనాలను తీసేయాలి. అనంతరం మిక్సీ బ్లెండర్‌లో కాకరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, అందులోనే చిన్న అల్లం ముక్క, కొద్దిగా పుదీనా ఆకులు, నల్ల ఉప్పు, పసుపు, కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసి మిక్సీ పట్టండి. తరువాత జ్యూస్ తీసి వడకట్టి అందులో 3 టీస్పూన్ల నిమ్మరసం కలిపి తాగేయండి. దీన్ని 30 ఎంఎల్ మోతాదులో రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. ఈ విధంగా చేస్తే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.