Neem Leaves : స్నానం చేసే నీటిలో త‌ప్ప‌నిస‌రిగా వేపాకుల‌ను వేయాల్సిందే.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

Neem Leaves : వేప చెట్లు మ‌న‌కు ఎక్క‌డ చూసినా క‌నిపిస్తాయి. అందువ‌ల్ల మ‌న‌కు వేపాకుల‌ను పొంద‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. వేపాకులు వేసిన నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. వేపాకుల్లో ఫ్యాటీ యాసిడ్లు, లిమోనోయిడ్స్, విట‌మిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం వంటి పోష‌కాలు ఉంటాయి. ఇవి అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. అందువ‌ల్ల గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయ‌డంతోపాటు ఆ నీటిలో వేపాకుల‌ను వేయాలి. ఈ క్ర‌మంలోనే అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

you should drop Neem Leaves in bathing water for these amazing benefits

వేపాకుల‌ను వేసి నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం పొడిద‌నం త‌గ్గుతుంది. చ‌లికాలంలో చర్మం మ‌రీ పొడిగా అయ్యేవారు ఈ విధంగా స్నానం చేయ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈవిధంగా స్నానం చేస్తే చ‌ర్మంపై ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన నూనెలు అలాగే ఉంటాయి. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది.

వేపాకులు వేసిన నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. జుట్టుకు అయితే చుండ్రు త‌గ్గుతుంది. జుట్టు స‌మ‌స్య‌లు కూడా పోతాయి. శిరోజాలు, త‌ల‌పై భాగం ఆరోగ్యంగా ఉంటాయి.

వేపాకుల‌ను వాడ‌లేమ‌ని అనుకునేవారు మార్కెట్‌లో వేప నూనె ల‌భిస్తుంది. దాన్ని కూడా నీటిలో వేసి ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతోనూ ఆయా స‌మ‌స్య‌లు పోతాయి.

ఇక వారానికి ఒక‌సారి వేపాకుల‌ను పేస్ట్‌లా చేసి శ‌రీరానికి రాసి గంట సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు పోయి చ‌ర్మం మృదువుగా మారుతుంది. పొడిద‌నం త‌గ్గుతుంది. చ‌ర్మంపై ఉండే ముడ‌త‌లు కూడా పోయి య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు.

వేప ఆకులు లేదా వేప నూనెను వేసిన నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, బ్లాక్ హెడ్స్ త‌గ్గుతాయి. వేప నూనెతో శ‌రీరాన్ని వారానికి ఒక‌సారి మ‌సాజ్ కూడా చేసుకోవ‌చ్చు.

సాధార‌ణంగా మ‌నం చ‌ల్ల‌నినీరు, వేడి నీళ్లు క‌లిపి ఒక మోస్త‌రు వేడి ఉండేలా చూసుకుని ఆ నీటితో స్నానం చేస్తాం. క‌నుక చ‌ల్ల‌ని నీటిలో ముందు రోజు రాత్రే వేపాకుల‌ను వేసి ఉంచాలి. మ‌రుస‌టి రోజు ఆ నీటిలో వేడి నీటిని క‌లిపి దాంతో గోరు వెచ్చ‌గా నీరు ఉండేలా చూసుకుని స్నానం చేయాలి. దీని వ‌ల్ల పైన తెలిపిన స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts