Green Tea : గ్రీన్ టీ.. ప్రస్తుత రోజుల్లో చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇది. బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుందని చాలా మంది దీనిని తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గ్రీన్ టీ అంటే ఏమిటి.. దీనిని ఏ ఆకులతో తయారు చేస్తారు.. గ్రీన్ టీ ని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీ ని కెమెలియా సైనెసిస్ అనే మొక్కకు చెందిన ఆకుల నుండి తయారు చేస్తారు. ఈ పొడి తయారీ సాధారణ టీ పొడి తయారీలా ఉండదు. ఈ మొక్క ఆకులు లేత నుండి కొద్దిగా ముదురుగా మారిన తరువాత వాటిపై ఎండ తగలకుండా పరదా వంటిది కప్పుతారు. దీంతో ఆకులు ఎండిపోతాయి.
ఇలా కొద్ది రోజులు ఉంచిన తరువాత ఆ ఆకులను తెంపి మళ్లీ వాటిని నీడలో ఎండబెట్టి రోలింగ్ చేస్తారు. ఆ తరువాత పొడిగా చేసి ప్యాక్ చేస్తారు. ఈ టీ పొడి తయారీ మొత్తం సహజ సిద్ద పద్దతిలోనే జరుగుతుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. గ్రీన్ టీ ని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీ ని తయారు చేసుకోవడానికి ఒక కప్పు వేడి నీటికి ఒక టీ స్పూన్ పొడిని వేడి చేస్తే చాలు. అయితే నీటిని బాగా వేడి చేసిన తరువాత మాత్రమే ఈ పొడిని వేసి 4 నిమిషాల వేచి ఉండాలి. ఆ తరువాత వచ్చిన మిశ్రమాన్ని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రీన్ టీ తయారవుతుంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది గ్రీన్ టీ లో రుచి కొరకు పంచదారను కలుపుకుని తాగుతున్నారు.
అలా తాగితే సాధారణ టీ ని తాగినట్టే అవుతుంది. కాబట్టి పంచదారను వేసుకోకుండా గ్రీన్ టీ ని తాగితేనే ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ టీ ని రోజూ ఉదయం, సాయంత్రం తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు గ్రీన్ టీ లో అధికంగా ఉన్నాయి. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గ్రీన్ టీ ని తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం. జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ ఫెక్షన్ లబారిన పడకుండా ఉంటాం. గ్రీన్ టీ ని తాగితే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో రక్తసరఫరా మెరుగుపడుతుంది. మధుమేహంతో బాధపడే వారు గ్రీన్ టీ ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
నొప్పులు, వాపులను తగ్గించడంలో గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుంది. గ్రీన్ టీ ని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. కాలేయం శుభ్రపడుతుంది. అయితే దీనిని తాగడం వల్ల కొందరిలో దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఎలాంటి వారు గ్రీన్ టీ ని తాగకూడదో కూడా ఇప్పుడు తెలుసుకందాం. గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా మేరకు మాత్రమే గ్రీన్ టీ ని తాగాలి. ఎందుకంటే దీనిలో ఉండే ఔషధ గుణాలు కడుపులో ఉండే పిండాలపై దుష్ప్రభావాలను చూపిస్తాయి. గ్రీన్ టీని పెద్దలు మాత్రమే తాగాలి. పిల్లలకు ఇవ్వకూడదు. పిల్లలకు గ్రీన్ టీ ని తాగడం వల్ల పిల్లలకు పోషకాలు అందక వారిలో ఎదుగుదల చక్కగా ఉండదు. రక్తహీనతతో బాధపడే వారు కూడా గ్రీన్ టీ తాగకూడదు.
గ్రీన్ టీ తాగడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహించదు. ఇక నిద్రలేమి సమస్యలతో బాధపడే వారు కూడా గ్రీన్ టీ తాగకూడదు. గ్రీన్ టీ ని తాగడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువచ్చే అవకాశం ఉంది. అలాగే హైబీపీ ఉన్న వారు కూడా గ్రీన్ టీ ని తాగకూడదు. ఎందుకంటే గ్రీన్ టీ ని తాగడం వల్ల రక్తసరఫరా ఎక్కువయ్యి బీపీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. గ్రీన్ టీ వల్ల ఉపయోగాలు ఉన్నప్పటికి దీనిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని అప్పుడే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.