White Bread Side Effects : మనలో చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో రకరకాల ఆహారాలను తింటుంటారు. వాటిల్లో బ్రెడ్ కూడా ఒకటి. చాలా మంది త్వరగా అవుతుందని బ్రెడ్‌కు చెందిన బ్రేక్‌ఫాస్ట్‌లను తయారు చేసి ఉదయం పరగడుపున తింటుంటారు. అయితే వాస్తవానికి ఉదయం పరగడుపున బ్రెడ్‌ను తినడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే బ్రెడ్ తినడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్‌లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. పోషకాలు అసలు ఉండవు. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ కూడా ఎక్కువే. కనుక బ్రెడ్‌ను తిన్న వెంటనే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఇలా తరచూ బ్రెడ్‌ను తింటుంటే టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక ఉదయం పరగడుపున బ్రెడ్ తినరాదు. ఇక బ్రెడ్‌ను తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగి ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీంతో ఆకలి బాగా అవుతుంది. ఫలితంగా అధికంగా తింటారు. ఇది అధిక బరువుకు కారణమవుతుంది. కనుక ఉదయం బ్రెడ్‌ను తినడం మానేయాలి.
బ్రెడ్‌లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కనుక ఉదయం బ్రెడ్‌ను పరగడుపున తింటే అది జీర్ణం కాక మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్రెడ్‌లో సోడియం అధికంగా ఉంటుంది. సోడియం అధికంగా ఉండే ఆహారాలను ఉదయం తినడం అంత మంచిది కాదు. దీంతో కిడ్నీలపై భారం పడుతుంది. కనుక ఎటు చూసినా బ్రెడ్ వల్ల నష్టాలే ఉన్నాయి కానీ లాభాలు లేవు. కాబట్టి ఉదయం పరగడుపున బ్రెడ్‌ను తినడం మానేయండి. ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌లో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకు పోషణ లభిస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.